Moviesమాటకు ముందు మహేష్ బాబు ఫారిన్ టూర్లు వెళ్లడం వెనకాల ఇంత...

మాటకు ముందు మహేష్ బాబు ఫారిన్ టూర్లు వెళ్లడం వెనకాల ఇంత పెద్ద కారణం ఉందా..? ఇన్నాళ్లకు బయటపడిన నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే ఎలాంటి అరుపులు కేకలు వినపడతాయో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయనలోని స్పెషల్ స్టైల్ కు జనాలు ఫిదా అవుతుంటారు . ఏజ్ పెరిగిపోతున్నా సరే ఇంకా కుర్రాడిలా కనిపిస్తూ అభిమానుల్ని యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు. రీసెంట్గా మహేష్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం . జనవరి 12వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. కాగా ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు మహేష్ బాబు .

రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది . రీసెంట్గా గుంటూరు ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయనకు “ఫారిన్ టూర్లకి ఎందుకు ఎక్కువగా వెళ్తారు..??” అన్న ప్రశ్న ఎదురయింది . ఈ క్రమంలోనే మహేష్ బాబు తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు . “అవునండి నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం .. అందుకే నేను ఎక్కువగా ఫారిన్ టూర్లకి వెళ్తాను .. నేను ఇండియాలో అలా రోడ్డు మీద తిరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు.”

“నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు.. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అసలు ఉండకూడదు.. అందుకే నాకు చిన్న టైం దొరికిన నేను ఫారిన్ కి వెకేషన్ ని ఎంజాయ్ చేయడానికి వెళ్తాను.. నా కుటుంబమే నాకు ఇంపార్టెంట్” అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు మహేష్ బాబు. అంతేకాదు చాలా మంది స్టార్స్ కూడా మహేశ్ బాబు ని ఇదే కారణంగా పలు సార్లు వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తూ ఉంటారు. ఈ ఆన్సర్ విన్నాక ఇక ఎవ్వడు కూడా మహేశ్ జోలికి పోడు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news