Moviesఫ్యాన్స్ చేసిన పనికి నడి రోడ్డు పై పరుగులు పెట్టిన రష్మిక...

ఫ్యాన్స్ చేసిన పనికి నడి రోడ్డు పై పరుగులు పెట్టిన రష్మిక మందన్నా.. వీడియో వైరల్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మడు జెట్ స్పీడ్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటిగా మారిపోయింది . రీసెంట్గా నటించిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆమెకు బోలెడన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది . రీసెంట్గా రష్మిక మందన్నా యానిమల్ సక్సెస్ మీట్ లో పాల్గొనడానికి ముంబై వెళ్లారు.

ఈ క్రమంలోనే అక్కడ జనాలు ఆమెతో సెల్ఫీ దిగాలని తెగ ఆతృతపడ్డారు..ఆమెను పరుగులు తీయించారు . ఫ్యాన్స్ చుట్టూ ముట్టడంతో ఆమె కంగారు పడిపోయింది. త్వరగా బయలుదేరాలి అన్న హడావిడిలో కన్ఫ్యూషన్ లో తన కారు బదులు వేరొక కార్ ఎక్కబోయింది .. దీంతో వెంటనే స్పందించిన టీం..” మేడం అది మన కారు కాదు “అంటూ అలర్ట్ చేశారు . వెంటనే తన కారువైపు వేగంగా పరుగులు తీసింది రష్మిక.

ఈలోపే ఫోటోలంటూ ఫ్యాన్స్ వెంటపడడంతో ఆమె హడావిడిగా కారు ఎక్కడానికి ప్రయ్త్నించింది. ఇద్దరు ముగ్గురికి సెల్ఫీ ఫోటోలు ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె వీడియో వైరల్ గా మారింది . ఫాన్స్ దెబ్బకు పరుగులు తీసిన రష్మిక మందన్నా అంటూ జనాలు ట్రోల్లింగ్ కూడా స్టార్ట్ చేశారు. ప్రజెంట్ రష్మిక తెలుగు మూడు బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తుంది. అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సినిమాలే కావడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news