Moviesచిరంజీవికి కి మరో అరుదైన అవార్డ్.. దట్ ఈజ్ మెగాస్టార్..!!

చిరంజీవికి కి మరో అరుదైన అవార్డ్.. దట్ ఈజ్ మెగాస్టార్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత ఆయన పేరు బాగా పాపులారిటీ దక్కించుకునేలా చేసుకున్నాడు . ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చే స్థాయికి ఆయన ఎదిగాడు అంటే ఆయనలో ఎంత టాలెంట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

భారతీయ సినీ పరిశ్రమలో చిరంజీవి సాధించిన విజయాలు అవార్డులు రివార్డులు అన్ని ఇన్ని కాదు . ఇండియన్ సినిమా ఇండస్ట్రీకు ఎన్నో సేవలను అందించాడు . కాగా చిరంజీవి చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకు ఎన్నో అవార్డులు కూడా అందజేశారు. తాజాగా సోషల్ మీడియాలో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డులలో చిరుకి అరుదైన గౌరవం దక్కే అవకాశం ఉందట.

2024 సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల్లో చిరంజీవి పేరును పరిశీలిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . త్వరలోనే మెగాస్టార్ కి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటిస్తారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మా చిరంజీవికి ఎప్పుడెప్పుడు ఆ అవార్డు ఇస్తారా ..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news