Moviesవిజ‌య్ దేవ‌ర‌కొండ‌ హీరోయిన్ ప్రైవేటు ఫోటోలు లీక్‌... అడ్డంగా బుక్‌..!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ హీరోయిన్ ప్రైవేటు ఫోటోలు లీక్‌… అడ్డంగా బుక్‌..!

అన‌న్య పాండే గుర్తుందా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా లైగ‌ర్ సినిమాలో న‌టించింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత ఆమె తెలుగులో ఏ సినిమాలోనూ న‌టించ‌లేదు. తాజాగా ఆమె గ‌త కొంత కాలంగా బాలీవుడ్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. దీనికి కార‌ణం ఆమె ప్రైవేటు ఫొటోలు లీక్ కావ‌డంతో పాటు అవి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆదిత్య‌రాయ్ క‌పూర్‌తో ఈ ముద్దుగుమ్మ గత కొంత‌కాలంగా డేటింగ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఏ మాత్రం వీలున్నా ఇద్ద‌రూ విదేశాల‌కు చెక్కేస్తూ ఉంటారు. అక్క‌డ ఫుల్లుగా ఎంజాయ్ చేసి త‌ర్వాత తిరిగి ఇండియాకు వ‌స్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు ఎంజాయ్ చేసేందుకు ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లారు. అక్క‌డ వీరిద్ద‌రు చాలా క్లోజ్‌గా అంటే చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇవి వైర‌ల్ కావ‌డంతో అన‌న్య స్పందించింది… ఇలాంటివి త‌న‌ను ఎంత‌మాత్రం బాధ‌పెట్ట‌వ‌ని.. ఓ న‌టిగా మారిన‌ప్పుడే తాను ప్రైవ‌సీ విష‌యంలో కాంప్ర‌మైజ్ అవుతాన‌ని చెప్పింది.

వీరిద్ద‌రు త‌మ బంధం గురించి కూడా ఓపెన్ అయ్యారు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో కూడా అన‌న్య త‌న‌ను తాను అన‌న్య క‌పూర్‌గా ప‌రిచ‌యం చేసుకుంది. అటు ఆదిత్య కూడా అన‌న్య‌తో త‌న ఎఫైర్‌ను ఒప్పుకున్నాడు. ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను తాను చాలా సీక్రెట్‌గా ఉంచేందుకే ట్రై చేస్తుంటాన‌ని.. అయితే అవి లీక్ కాకుండా తాను అడ్డుకోలేన‌ని చెప్పింది.

ఇక కొన్నాళ్ల క్రితం అన‌న్య ఓ ఫంక్ష‌న్లో గుప్పుగుప్పుమంటూ పొగ‌లు వ‌దులుతూ.. సిగార్ తాగుతున్న వీడియోలు, ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి సోష‌ల్ మీడియాలో ఎలా వైర‌ల్ అయ్యాయో చూశాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news