News' వార్ 2 ' సినిమాలో ఎన్టీఆర్ ఫ‌స్ట్ సీన్ ఇదే.....

‘ వార్ 2 ‘ సినిమాలో ఎన్టీఆర్ ఫ‌స్ట్ సీన్ ఇదే.. ఫ్యీజులు ఎగురుతాయ్‌.. గూస్‌బంప్స్ మోతే…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు వ‌చ్చిన క్రేజ్ నేప‌థ్యంలో ఇప్పుడు వ‌రుస పెట్టి అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేసే ప్లాన్‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ దేవ‌ర సినిమా చేస్తున్నాడు. ఇది భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోంది.

దేవ‌ర రెండు పార్టులుగా రిలీజ్ అవుతోంది. దేవ‌ర త‌ర్వాత ఎన్టీఆర్ మ‌రో మోస్ట్ వాంటెడ్ మ‌ల్టీస్టార‌ర్ వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి తెర‌పంచుకోబోతున్నాడు. ఇక ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంది. ఇది వార్ 2 త‌ర్వాత ప‌ట్టాలెక్కుతుంది.

ఇదిలా ఉంటే వార్ 2కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. వార్ 2 సినిమా కోసం మార్చి నుంచి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. మార్చి మొదటి వారానికి ప్ర‌స్తుతం చేస్తోన్న‌ ‘దేవర’ షూటింగ్ పూర్తి అవుతుంది. ఆ వెంట‌నే ఓ వారం లేదా ప‌ది రోజులు విశ్రాంతి తీసుకుంటాడు. వెంట‌నే వార్ 2 ప్రాజెక్ట్ కోసం డేట్లు కేటాయిస్తాడు.

ఈ సినిమాలో ముందుగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట‌. ఈ సీన్‌కు థియేట‌ర్ల‌లో విజిల్స్ మోత మోగిపోతుంద‌ని… గూస్‌బంప్స్ ఖాయ‌మని తెలుస్తోంది. వార్ 2 కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుంద‌ట‌. అర్జ‌నుడు – కృష్ణుడిలా క‌లిసి ఉన్న ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య వైరం వ‌స్తే ఏం జ‌రుగుతుంది… అన్న‌దే ఈ సినిమా క‌థ‌గా తెలుస్తోంది. ఆదిత్య‌చోప్రా ఈ సినిమాకు నిర్మాత‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news