Newsమేక‌ప్ ఉమ‌న్‌గా మొద‌లై.. కుర్ర‌కారు గుండెలు పిండేసిన బ్యూటీ.. ఎవ‌రో తెలుసా?

మేక‌ప్ ఉమ‌న్‌గా మొద‌లై.. కుర్ర‌కారు గుండెలు పిండేసిన బ్యూటీ.. ఎవ‌రో తెలుసా?

ఆమె సినీరంగంపై ఉన్న ఆస‌క్తితో అనేక క‌ష్టాలకు ఓర్చి.. మేక‌ప్ ఉమ‌న్‌గా త‌న కెరీర్‌ను ప్రారంభించింది. అయితే.. త‌న కన్నా పెద్ద‌గా అందంగా లేని వారు హీరోయిన్లుగా బాగా సంపాయించుకుంటున్నార‌ని బావించిన ఆమె నెమ్మ‌దిగా తెర ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఇలా.. చిన్న వేషంతో రంగంలోకి దిగిన ఆ బ్యూటీ.. కుర్ర‌కారు గుండెల‌ను హోరెత్తించింది. ఆమే.. విజ‌య‌ల‌క్ష్మి.. ఉర‌ఫ్ సిల్క్ స్మిత‌.

తన అందచందాలతో ఓ తరం కుర్రకారును ఉర్రూతలూగించిన నటి ఆమె. ఓ దశలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే.. సిల్క్ స్మిత‌తో పాట లేకుండా ఉండేది కాదు. వెండితెర శృంగార తారగా నిలిచిపోయిన సిల్క్‌ స్మిత.. జీవితం అంత వ‌డ్డించిన విస్త‌రైతే కాదు. చాలా క‌ష్టాలు ప‌డి.. ఊహించని పేరు, డబ్బు, హోదా సంపాదించింది.

సిల్క్‌ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. ఏలూరు చెందిన ఓ పేద రైతు కుటుంబంలో జన్మించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగో తరగతిలోనే చదువు ఆపేసింది. చిన్నవయసులోనే పెళ్లి జరిగింది. అయితే అక్కడ కూడా తనకు సుఖం లేకుండా పోవ‌డంతో రాత్రిరాత్రి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఒంట‌రిగా చెన్నై(అప్ప‌టి మ‌ద్రాస్‌) చేరింది. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

అయితే, ఆమెకు అవ‌కాశాలు రాలేదు. దీంతో సిల్క్‌ స్మిత నటీమణులకు మేకప్‌ వేయడం ప్రారంభించింది. తర్వాత 1979లో వచ్చిన ‘పండిచక్రమ్’ తమిళ చిత్రం ఆమెను తెర‌పై నిల‌బెట్టింది. తన 17 ఏళ్ల కెరీర్‌లో 450పైగా సినిమాల్లో నటించి, తన అందచందాలతో మెప్పించింది. చాలా సినిమాల్లో ఆమె ఐటం సాంగ్‌లోనే ఎక్కువ‌గా న‌టించ‌డం విశేషం. ఐటమ్‌ సాంగ్స్‌కి పెట్టింది పేరుగా సిల్క్‌ స్మిత వెలుగొందింది. ‘ఇండియన్‌ మార్లిన్‌ మన్రో’గా జేజేలు కొట్టించుకున్న ఆమె చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news