Newsఆ సినిమాలో రష్మిక చేసిన తప్పే.. ఇప్పుడు శ్రీలీల రిపీట్ చేస్తుందిగా.....

ఆ సినిమాలో రష్మిక చేసిన తప్పే.. ఇప్పుడు శ్రీలీల రిపీట్ చేస్తుందిగా.. ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరే నా..?

తెలుగులో స్టార్ హీరోయిన్ శ్రీలీలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆదివారం సమయంలో షూటింగ్ లు చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపించరు.శ్రీలీల డేట్స్ ఇస్తే మాత్రం ఆదివారం కూడా షూట్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రష్మిక చేసిన తప్పులనే శ్రీలీల రిపీట్ చేస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రష్మిక సరిలేరు నీకెవ్వరు, వారసుడు సినిమాలలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలలో నటించారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ సినిమాలు సక్సెస్ సాధించినా రష్మికకు మాత్రం క్రేజ్ పెరగలేదు. శ్రీలీల స్కంద, ఆదికేశవ సినిమాలలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలలో నటించారు. ఇలాంటి సినిమాలలో నటించడం వల్ల శ్రీలీల కెరీర్ కు నష్టమే తప్ప లాభం కలగదనే సంగతి తెలిసిందే.

ఆమె ఈ విధంగా తప్పులు చేయడం ద్వారా ఆమె పడిన కష్టం, తెచ్చుకున్న గుర్తింపుకు ఏ మాత్రం ప్రతిఫలం ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో సైతం పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో శ్రీలీల కనిపించనున్నారని తెలుస్తోంది. శ్రీలీల రేంజ్ అంతకంతకూ పెరగాలంటే ఇకపై ఆమె అభినయ ప్రధాన పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలి. గ్లామర్ రోల్స్ శ్రీలీలకు సూట్ కావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలీల రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాల్సి ఉంది. గుంటూరు కారం సినిమా సక్సెస్ సాధిస్తే శ్రీలీలకు కెరీర్ పరంగా కొంతమేర బెనిఫిట్ కలుగుతుంది. ప్రస్తుతం 3 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ అందుకుంటున్న శ్రీలీల భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా సత్తా చాటుతారో చూడాల్సి ఉంది. శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎన్టీఆర్, బన్నీలకు శ్రీలీల జోడీగా నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news