Moviesబాల‌య్య 109కు సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా టైటిల్‌...!

బాల‌య్య 109కు సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా టైటిల్‌…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్‌ కేసరి సినిమాలతో రెండు సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా ఆయన కెరీర్ లో 109వ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కొల్లి బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతుంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ కీలకమైన షెడ్యూల్ రీసెంట్గా రాజస్థాన్‌లో ప్లాన్ చేయగా ఆ షూటింగ్‌లో బాలయ్య జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ సినిమా యుగంధర్ టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ డాన్ గా నటించిన ఈ యాక్షన్ సినిమా 1979లో రిలీజ్ అయింది.

అమితాబ్‌ సూపర్ హిట్ సినిమా డాన్ ఆధారంగా యుగంధర్ సినిమాను తెలుగులో నిర్మించారు. ఈ సినిమాకు యాక్షన్ సినిమాల దర్శకుడు కే.య‌స్.ఆర్. దాస్‌ దర్శకత్వం వహించారు. మరి యుగంధర్ అనేది చాలా పవర్ ఫుల్ టైటిల్.. ఫైనల్ గా బాలయ్య సినిమాకు ఈ టైటిల్ ఖరారు అవుతుందా.. లేదా మరో టైటిల్ ప్లాన్ చేస్తారా ? అన్నది చూడాలి. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం లో నటిస్తున్నారు. సెకండ్ హాఫ్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news