Newsఈమె ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ ఏంట్రా బాబు... బుర్ర ఖ‌రాబైందా... అస‌లు...

ఈమె ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ ఏంట్రా బాబు… బుర్ర ఖ‌రాబైందా… అస‌లు గుర్తు ప‌ట్టారా…!

పై ఫోటోలో కనిపిస్తున్న ఆంటీ పవన్ కళ్యాణ్ హీరోయిన్. ఈ టైటిల్ చూస్తుంటే మీకు నిజంగానే బుర్ర కరాబ్ అయినట్టు అనిపిస్తుందా.. నిజమే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో పవన్ పక్కన కొన్ని సీన్లలో కవ్విస్తూ త‌ళుకుమన్న ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకుని అసలు గుర్తుపట్టకుండా ఆంటీని మించిపోయింది. శేఖర్ కమ్ములు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో హ్యాపీడేస్ సినిమా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా హ్యాపీడేస్ సినిమా యూత్ కు బాగా నచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీ లైఫ్ ఎలా ఎంజాయ్ ?చేయాలో ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ తమన్నా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మంగ్‌ హీరో నిఖిల్ కూడా ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరు ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాలో నటించిన అప్పు మీకు గుర్తుందా.. ఈ సినిమాలో ఆమె నిఖిల్‌కి జోడిగా నటించింది. టామ్ బాయ్‌ గెటప్ లో నటించి మెప్పించిన అప్పు అసలు పేరు గాయత్రి రావు.

హ్యాపీ డేస్ సినిమా తర్వాత అప్పుకు మంచి అవకాశాలు వస్తాయి.. టాలీవుడ్ లో దూసుకుపోతుందని అందరూ అనుకున్నా అలా జరగలేదు. గాయత్రీ రావు తల్లిదండ్రులు కూడా సినీ నటులే కావటం విశేషం.
గాయత్రి రావు తల్లి బెంగళూరు పద్మ ఆమె ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సీనియర్ నటిమణిగా నటించారు. హ్యాపీడేస్ సినిమా తర్వాత గాయత్రీ రావు.. రామ్ చరణ్ ఆరంజ్ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో చిన్న పాత్రలో ఆమె నటించింది.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ స్నేహితురాలి పాత్రలో పవన్ కళ్యాణ్‌ను కవ్వించే పాత్ర‌లో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడు పెళ్లి పీట‌లు ఎక్కి సినిమాలకు దూరం అయింది. హ్యాపీ డేస్ లో చాలా సన్నగా కనిపించిన అప్పు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పెళ్లయ్యాక ఆమె బాగా లావు ఎక్కిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాన్నాయి. ప్రస్తుతం సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న గాయత్రీ రావు మంచి పాత్రలలో నటిమ‌చే అవకాశం వస్తే తిరిగి టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తానని చెబుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news