Movies"ఎన్టీఆర్ కి అలాంటి దోషం ఉంది.. రహస్యంగా ఉంచారు".. భయపెడుతున్న...

“ఎన్టీఆర్ కి అలాంటి దోషం ఉంది.. రహస్యంగా ఉంచారు”.. భయపెడుతున్న వేణు స్వామి కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ .. వేణు స్వామి చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానులను భయపెట్టేస్తున్నాయి. సోషల్ మీడియాలో వేణు స్వామి బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు . స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన జీవిత సీక్రేట్స్ గురించి బయట పెట్టేస్తూ అభిమానులకు బాగా దగ్గరయిపోయాడు . ఆయన చెప్పింది చెప్పినట్లు తూచా తప్పకుండా జరుగుతూ ఉండడం గమనార్హం. హీరోయిన్ సమంత విడాకులు తీసుకుంటుంది అని ముందే వివరించారు .

నందమూరి తారకరత్న మరణిస్తాడు అని ముందుగానే హింట్ ఇచ్చాడు. ఇలా ఆయన చెప్పింది చెప్పినట్లు జరుగుతూ ఉండడంతో స్టార్ సెలబ్రెటీస్ కూడా ఆయన జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతూ వచ్చారు. కొందరు ఇంటికి పిలిపించి ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు. అలాంటి వేణు స్వామి జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివాదస్పద జ్యోతిష్యుడు గా పేరు సంపాదించుకున్న వేణు స్వామి ఎన్టీఆర్ తల్లి శాలినిను తిరుమల లో కలిశారట . అంతేకాదు అప్పటికే ఎన్టీఆర్ జాతకాన్ని చూసి ఆయన షాక్ అయిపోయారట .

తిరుమల ఆలయంలో ఆయనను కలిసిన ఎన్టీఆర్ తల్లి శాలిని వేణు స్వామి చెప్పిన మాటలకు షాక్ అయిపోయిందట . “తారక్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది.. ఆ దోషం తెలియకుండా తారక్ జాతకం అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు అంటూ ఆశ్చర్యపోయిందట “. ఆ సమస్య ఏంటో నాకు తెలుసు తల్లి అని తారక్ కి ఉన్న పుట్టక దోషం గురించి ఆయన క్లియర్గా చెప్పేసాడట . దీంతో శాలిని అక్కడికక్కడే షాక్ అయిపోయిందట .

“ఆ దోషం గురించి నాకు తారక్ కి పెద్ద ఎన్టీఆర్ కి మాత్రమే తెలుసు .. నాలుగో వ్యక్తికి ఎవరికి తెలియదు.. అలాంటిది మీకు ఎలా తెలుసు అని ఆమె వేణు స్వామిని నిలదీసిందట . నాకు అన్ని విషయాలు తెలుసమ్మ అంటూ ఆయన చెప్పడంతో ఆమె షాక్ అయిపోయిందట. అయితే ఆ సమస్య ఏంటి అనేది మాత్రం బయట పెట్టలేదు వేణు స్వామి . “జూనియర్ ఎన్టీఆర్ ది మకా నక్షత్రం జయలలిత గారిది కూడా అదే నక్షత్రం అని .. తారక్ రాజకీయాలకు రావడానికి ఇంకా సమయం ఉందని.. ఖచ్చితంగా 2030 వరకు తారక్ ని రాజకీయాల్లోకి రానివ్వకుండా వాళ్ళ అమ్మగారు అడ్డుపడుతుందని.. తాత గారికి రాజయోగం ఎలా పట్టిందో ,,మనవడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అలాగే రాజయోగం పడుతుంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు “. అయితే ఆ జాతకంలో దోషం ఏంటో చెప్పకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news