MoviesTL రివ్యూ: డెవిల్ .. క‌ళ్యాణ్‌రామ్ ఖాతాలో మ‌రో హిట్టు బొమ్మ‌...!

TL రివ్యూ: డెవిల్ .. క‌ళ్యాణ్‌రామ్ ఖాతాలో మ‌రో హిట్టు బొమ్మ‌…!

టైటిల్‌: డెవిల్‌
నటీనటులు: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
మ్యూజిక్‌: హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాత: అభిషేక్‌ నామా
దర్శక‌త్వం : అభిషేక్‌ నామా
రిలీజ్ డేట్‌ : డిసెంబర్ 29, 2023

ప‌రిచ‌యం:
గత ఏడాది బింబిసార సినిమాతో కెరీర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కళ్యాణ్ రామ్. ఈ యేడాది ప్రారంభంలో అమీగోస్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి నిరాశపరిచాడు. ఇప్పుడు 2023 కి ముగింపు పలుకుతూ ఈరోజు డెవిల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్ నటించిన ఈ సినిమా అభిషేక్ నామ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కింది. టీజర్లు.. ట్రైలర్లతో అంచనాలు పిన్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
భారతదేశంలో బ్రిటిష్ పాలన జరుగుతున్నప్పుడు జరిగిన కథ ఇది. బ్రిటిష్ ప్రభుత్వం అజ్ఞాతంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ కోసం అన్వేషిస్తూ ఉంటుంది. ఈ లోగా సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన ఓ వార్త బ్రిటిష్ అధికారులకు అందుతుంది. మరోవైపు మద్రాస్ రాష్ట్రంలో రాసపాడు జమీందారు సంస్థానంలో ఓ హత్య జరుగుతుంది. జమీందారు కుమార్తెను ఎవరో చంపేస్తారు. పనిమనిషి కూడా మాయం అవుతుంది. ఈ కేసు చేదించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సీక్రెట్ ఏజెంట్ డెవిల్ ( కళ్యాణ్ రామ్) నియమిస్తుంది. ఈ మామూలు హత్య కేసుని బ్రిటిష్ ప్రభుత్వం డెవిల్ చేతుల్లో పెట్టడానికి కారణం ఏంటి ? ఇంతకీ సుభాష్ చంద్రబోస్ గురించి బ్రిటీషర్లకు తెలిసిన నిజం ఏమిటి ? సుభాష్ చంద్రబోస్ కుడి భుజం త్రివర్ణ ఎవరు ?ఇదంతా ఈ సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. అలాగే హత్య జరిగిన బంగ్లాలో ఉంటున్న నైషధ‌ ( సంయుక్తా మీనన్ ) ఎవరు ? ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు. నైష‌ధ‌కు.. నేతాజీకి ఉన్న సంబంధం ఏంటి ? ఈ మొత్తం కథలో మాళవిక నాయర్ ఎవరు ? ఇలా చాలా ప్రశ్నలు ఈ సినిమా చూస్తేనే అర్థమవుతాయి.

విశ్లేష‌ణ :
కళ్యాణ్ రామ్ తన గత సినిమాలు కంటే భిన్నంగా బ్రిటిష్ నేపథ్యంలో ఈసారి మైండ్ గేమ్.. యాక్షన్ డ్రామాతో సీక్రెట్ ఏజెంట్గా మన ముందుకు వచ్చాడు. తన లుక్స్ యాక్షన్ ఫ్రెష్ గా ఉంటుంది. సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్‌రామ్ నటన సినిమాకి హైలెట్ మెయిన్ గా.. సెకండ్ హాఫ్‌లో త్రివర్ణపాత్రకు సంబంధించి రివీల్ అయ్యే యాక్షన్ సీక్వెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సంయుక్తా మీన‌న్‌తో నడిచే ప్రేమ సన్నివేశాలు హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సంయుక్త చాలా సెటిల్ గా చక్కగా నటించింది. మరో కీలకపాత్రలో నటించిన మాళవిక నాయర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఆమె హావభావాలు బాగున్నాయి.

సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ నేతాజీ పాత్ర చుట్టూ స్క్రీన్ ప్లే నడపటం.. విలన్ గా నటించిన బ్రిటిష్ నటులు కూడా బాగా నటించారు. కమెడియన్ సత్యతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్ అజయ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. మెయిన్ పాయింట్ ట్రీట్మెంట్ బాగుంది. మొత్తం మీద సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు త్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఓ మర్డర్ మిస్టరీకి, దేశభక్తి కలిపి రాసుకున్న కథ ఇది. దీనికి తోడు సీక్రెట్ ఏజెంట్ జానర్ కూడా మిక్స్ చేయడంతో సినిమా ఆసక్తి రేపింది. తొలి సన్నివేశం నుంచి కథలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

మర్డర్ మిస్టరీ కి సినిమా ప్రారంభంలో చెప్పిన సుభాష్ చంద్రబోస్ ఎపిసోడ్ కి ఉన్న సంబంధం ఏంటి ?అన్నది అంతు పట్టదు. మధ్యలో త్రివర్ణ ఎవరు ? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకులలో బాగా కలుగుతుంది. అయితే ఆ పాత్ర ట్విస్ట్ చివర్లో రివిల్ చేయటం బాగుంది. మర్డర్ మిస్టరీని ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకుని తనకు నచ్చినట్టుగా స్క్రీన్ ప్లే మలుచుకున్నాడు దర్శకుడు. కళ్యాణ్ రామ్ కథ‌ల విషయంలో ఎప్పుడు అసంతృప్తికి గురి చేయలేదు. ఈసారి కూడా తన నటనలో కొత్తదనం ఎలా ఉన్నా ? పాత్ర పరంగా అతడికి ఇది కొత్తగా ఉంది.

సీరియస్ గా పలికే సంభాషణలో కళ్యాణ్ రామ్ డైలాగ్ మోడ్యుయేషన్ బాగుంది. అప్పుడప్పుడు ఈ తరహా ప్రయత్నాలు చేయటం అభినందించదగ్గ విషయం. హీరోయిన్ సంయుక్త మీనన్‌ది కూడా రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు.. తన వరకు హుందాగా పద్ధతిగా కనిపించింది. మాళవికానర్ పాత్ర సర్ప్రైసింగ్. సినిమాలో మైన్ కంటెంట్ బాగున్న స్క్రీన్ ప్లే విషయంలో కొన్నిచోట్ల గజిబిజీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

సెకండాఫ్ సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందని ? ఉత్కంఠ ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్న మేకర్స్ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. టెక్నికల్ విభాగాల గురించి మాట్లాడుకుంటే దర్శకుడు అభిషేక్ నామా తెర‌కెక్కించిన ఫైట్లు బాగున్నాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్స్ మిస్ కాకుండా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. నేపథ్య సంగీతం కొన్నిచోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రాఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతిఫ్రేమ్ చాలా ఎఫెక్ట్ గా తీశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
మరి బింబిసార రేంజ్ లో అంచనాలు లేకుండా థియేటర్లకు వెళితే డెవిల్ ఓకే అనిపిస్తాడు.

డెవిల్ రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news