News' స‌లార్ ' పై టాలీవుడ్‌లో అంత పెద్ద కుట్ర జ‌రుగుతోందా...!

‘ స‌లార్ ‘ పై టాలీవుడ్‌లో అంత పెద్ద కుట్ర జ‌రుగుతోందా…!

టాలీవుడ్ పాన్‌ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నైజంలో సలార్‌ను రికార్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. నైజాంలో దిల్ రాజు టాప్ డిస్ట్రిబ్యూటర్. అయితే మైత్రీ వాళ్ళు కూడా అక్కడ రంగంలోకి దిగి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ప్రారంభించారు.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య‌ రెండు సినిమాలు నైజాంలో మైత్రి వాళ్ళు సొంతంగా రిలీజ్ చేసుకుని.. నైజాం మార్కెట్ పై మంచి గ్రిప్ తెచ్చుకున్నారు. నైజాం రైట్స్ సేల్‌ కోసం ముందుగా దిల్ రాజుతో భేరసారాలు ప్రారంభించారు మేక‌ర్స్‌. దిల్ రాజు తక్కువ రేటుకు రైట్స్ అడగడంతో నిర్మాతలు అతనికి ఇవ్వకుండా రూ.65 కోట్లకు మైత్రీ మూవీ మేకర్స్‌కి ఇచ్చారని ఒక ప్రచారం ఉంది. ఎలాంటి పెద్ద సినిమాకు అయినా బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్లు రావాలంటే మొదటి వారం చాలా కీలకం. ఒకవైపు టిక్కెట్ రేట్లు పెంచడంతోపాటు.. అదనపు షోలకు పర్మిషన్లు తెచ్చుకోవాలి. దీనికి తోడు ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయాలి.

అయితే ఇప్పుడు నైజాం థియేటర్ల వ్యవస్థను శాసించే దిల్ రాజు ఇక్కడ సలార్ ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ఎంతవరకు సహకరిస్తారు ? అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం దగ్గర దరఖాస్తు చేసుకున్నారు. నైజాంలో ఈ సినిమా ఏకంగా రూ.65 కోట్ల బిజినెస్ చేయడంతో.. అంతే భారీ స్థాయిలో స్క్రీన్లు కూడా రావాల్సి ఉంటుంది. అయితే దిల్ రాజుకు మైత్రి మూవీ మేకర్స్‌కు మధ్య డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి కొన్ని గొడవలు ఉన్నాయన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే నైజాంలో యానిమల్, హాయ్ నాన్న సినిమాలను దిల్ రాజు రిలీజ్ చేశారు.

ఆ రెండు సినిమాలు బాగానే నడుస్తున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీని కూడా నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తారంటున్నారు. మరోవైపు హాలీవుడ్ సినిమా ఆక్వామ్యాన్‌ కూడా సలార్ కి మరో తలనొప్పిగా మారింది. అటు షారుక్, హాలీవుడ్ సినిమాతో పాటు ఇప్పటికే థియేటర్లో ఉన్న సినిమాలు ఇవన్నీ చూస్తే సలార్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా రేంజ్‌ను బట్టి థియేటర్లు దొరకటం చాలా కష్టంగా కనిపించేలా ఉంది. మరి దీనిని మైత్రి మూవీ మేకర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. మైత్రీ వాళ్లు రీసెంట్గా ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమాను కొని రూ.10 కోట్లు నైజంలో నష్టపోయారు. దీంతో సలార్ సక్సెస్ వీళ్ళకి చాలా కీలకంగా మారిందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news