News"శ్రీలీలని బుక్ చేసుకుంటే ఆ టార్చర్ అనుభవించక తప్పదు"..నితిన్ నోటి దూల...

“శ్రీలీలని బుక్ చేసుకుంటే ఆ టార్చర్ అనుభవించక తప్పదు”..నితిన్ నోటి దూల కామెంట్స్ పై ఫ్యాన్స్ సీరియస్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనకు తెలిసిందే. ప్రతి ఒక్క హీరో డైరెక్టర్ మేకర్స్ శ్రీ లీలనే తమ సినిమాలో వర్క్ చేయాలి అంటూ భీష్ముంచుకుని కూర్చోవడంతో .. ఆమె ఖాతాలో ఏకంగా 10 సినిమాలు వచ్చి చేరగ.. రీసెంట్గా నటించిన భగవంత్ కేసరి , ఆదికేశవ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్టు అందుకోవడంతో ఆమె పేరు మరింత స్థాయిలో వైరల్ అవుతుంది.

ఇలాంటి క్రమంలోనే డిసెంబర్ 8న రిలీజ్ అవ్వబోతున్న ఎక్స్ట్రార్డినరీ సినిమాతో కూడా హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది శ్రీ లీల అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నితిన్ మాట్లాడుతూ శ్రీ లీలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు . శ్రీ లీల తో సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ..షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

“ఆమెతో వర్క్ చేయడం ఇంట్రెస్టింగ్,, కానీ చాలా చాలెంజింగ్ పార్ట్ అనే చెప్పాలి . ఆమె డేట్స్ ఇస్తుందా..? లేదా ..? అన్నది పెద్ద సమస్య . అయితే ఇచ్చిన డేట్ ని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది మరింత పెద్ద సమస్య ..? ఒకవేళ డేట్స్ ఇస్తే హాఫ్ డే వస్తుందా ..? రెండు గంటలు వస్తుందా? మూడు గంటలు వస్తుందా..? అనేది పెద్ద సమస్యగా మారిపోయేది. శ్రీలీలతో ఎవరైతే నెక్స్ట్ డైరెక్టర్ సినిమాలు చేస్తున్నారో వాళ్లకి ఈ ప్రాబ్లం కచ్చితంగా ఎదురవుతుంది ..మేం ఏ టార్చర్ ని భరించామో.. ఇక నెక్స్ట్ వెంకీ కుడుముల వంతు స్టార్ట్ అవ్వబోతుంది..” అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు నితిన్ .దీంతో ఇదే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news