Moviesఆ ఒక్కటి లేకపోతే .. ప్రశాంత్ నీల్ దమిడికి కూడా పనికి...

ఆ ఒక్కటి లేకపోతే .. ప్రశాంత్ నీల్ దమిడికి కూడా పనికి రాడా..? అంత మాట అనేశాడు ఏంటి..?

ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఈ పేరు సినిమా ఇండస్ట్రీని శాసిస్తుంది . ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అంతకుముందు కేజిఎఫ్ సిరీస్ ఇప్పుడు సలార్ రెండు సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ ని షేక్ చేసేస్తున్నాడు ప్రశాంత్ నీల్. తాజాగా ఈయన తెరకెక్కించిన సినిమా సలార్. టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా నాలుగు రోజులు 500 కోట్లు మార్క్ దాటేసింది .

దీంతో రెబల్ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . ప్రశాంత్ నీల్ పేరుని బాగా ప్రమోట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు . అయితే మరి కొంతమంది మాత్రం ప్రశాంత్ నీల్ ని ట్రోల్ చేస్తున్నారు . ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కే జి ఎఫ్ సిరీస్-సలార్ ఒకే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది అని.. అంత బ్లాక్ అండ్ వైట్ ధీమ్ అని.. కోల్ కాన్సెప్ట్ అని .. ఆయన ను ట్రోల్ చేస్తున్నారు .

అంతేకాదు సలార్ హిట్ అవ్వడానికి ప్రభాస్ క్రేజ్ కూడా కారణమని ప్రశాంత్ నీల్.. తన డైరెక్షన్ ని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో కష్టాలు పడక తప్పదు అని .. ఎంతసేపు ఒకటే కాన్సెప్ట్ ఆయనను బ్రతికించలేదు అని .. ఆయన వే ఆఫ్ డైరెక్షన్ బాగుంటుంది తప్పిస్తే పెద్దగా ప్రశాంత్ నీల్ లో చెప్పుకోదగ్గ మ్యాటర్ లేదు అంటూ ఆయన హిట్ సక్సెస్ ని డి గ్రేడ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకుని హిట్ కొడితే నిజంగా ప్రశాంత్ నీల్ గ్రేట్ అని ఒప్పుకుంటామంటూ సవాల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news