Moviesమ‌హేష్ - రాజ‌మౌళి సినిమా... సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుండెలు ప‌గిలే న్యూస్...

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా… సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుండెలు ప‌గిలే న్యూస్ ఇది…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత 20 సంవత్సరాలుగా టాలీవుడ్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న రాజమౌళి, మహేష్ బాబు సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి ప్రముఖ స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఇప్పటికే కథ‌ పూర్తి చేశారని.. త్వరలోనే ముహూర్త కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.

రాజమౌళితో.. మహేష్ బాబు సినిమా అంటే మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అయితే మహేష్ అభిమానుల గుండెలు పగిలే న్యూస్ కూడా ఒకటి బయటకు వచ్చింది. రాజమౌళి సినిమా అంటే హీరోలు ఏళ్లకు ఏళ్ళు తమ డేట్లు ఇచ్చేయాల్సిందే. ప్రభాస్ బాహుబలి సినిమా కోసం ఐదు సంవత్సరాలు.. మరే సినిమా కూడా చేయలేదు. ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చే సినిమా రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి పార్ట్ కోసమే మహేష్ బాబు మూడు ఏళ్ళు టైం కేటాయించినట్టు తెలుస్తోంది.

అంటే 2024లో సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే మహేష్.. తర్వాత సినిమా కోసం మరో మూడు సంవత్సరాలు అంటే 2027 వరకు వెయిట్ చేయాల్సిందే. మూడు సంవత్సరాల పాటు మహేష్ నటించిన ఏ సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కాదు. ఇక రెండో పార్ట్ కి మరో రెండేళ్లు అంటే 2029 వరకు మహేష్.. రాజమౌళి కోసం డేట్లు ఇచ్చేయాల్సిందే. అంటే రెండు పార్టీల కోసం ఏకంగా అయిదారు సంవత్సరాలు మహేష్ రాసి ఇచ్చేయాల్సిందే అని.. అంతకుమించి మహేష్ దగ్గర ఆప్షన్ కూడా లేదని తెలుస్తోంది.

మహేష్ కి కెరీర్ పరంగా ప్రస్తుతం స్వర్ణ యుగం నడుస్తోంది. మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ టైంలో రాజమౌళి సినిమాల కోసం అయిదారు సంవత్సరాలు ఇవ్వడం అంటే.. చాలా పెద్ద సాహసం. అతడి చాలా విలువైన టైం రాజమౌళి సినిమాకు ఇవ్వక తప్పని పరిస్థితి. అయితే ఆ స్థాయిలో రాజమౌళి హిట్ ఇస్తే మహేష్ ఇచ్చిన త్యాగానికి న్యాయం జరిగినట్టు అవుతుంది. ఏది ఏమైనా మరో మూడేళ్లపాటు మహేష్‌ను వెండితెర మీద చూడలేం అంటే అభిమానులకు మాత్రమే కాదు.. సగటు సినీ ప్రేక్షకులకు కూడా బాధగా అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news