Moviesనానికి శ్రీరెడ్డి దిష్టి, పీడాకారం మొత్తం వ‌దిలిపోయిందా...!

నానికి శ్రీరెడ్డి దిష్టి, పీడాకారం మొత్తం వ‌దిలిపోయిందా…!

నేచురల్ స్టార్ నాని గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్నాడు. అటు సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కావడం లేదు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన నాని గత కొన్ని ఏళ్ళుగా పెద్దపెద్ద బ్యాన‌ర్లు, పేరున్న దర్శకులతో సినిమాలు చేసిన సక్సెస్ కాలేదు. మధ్యలో కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి నుంచి వ్యక్తిగత విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీ రెడ్డి.. నానిని దారుణంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. ఆ టైంలో నాని మానసికంగా కూడా ఇబ్బంది పడ్డాడు. అదే టైంలో ఇటు సినిమాలు కూడా ఫ్లాపులు అయ్యాయి.

అయితే ఈ ఏడాది నానికి.. శ్రీరెడ్డి దిష్టి పీడాకారం మొత్తం వదిలిపోయినట్టు ఉంది. ఈ ఏడాది నాని రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆడియన్స్‌కి అందించాడు. శ్రీకాంత్ ఓదెల‌ దర్శకత్వంలో విలేజ్ యాక్సిడెంట్ డ్రామా అయినా దసరా సినిమాతో నాని ఈ ఏడాది ఫస్ట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెన్స్ రాబట్టింది. నాని కెరీర్ లో తొలి రూ.100 కోట్ల సినిమాగా రికార్డుల్లో చేరింది. అలాగే డిసెంబర్‌లో ఏడాదికి ముగింపు పలుకుతూ హాయ్ నాన్న అంటూ మరోసారి ఆడియన్స్‌ను పలకరించారు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. అలాగే నాని తన తదుపరి సినిమా… సరిపోదా శనివారంతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా నానికి ఈ ఏడాది మామూలుగా కలిసి రాలేదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news