Newsవాట్..గబ్బర్ సింగ్ సినిమాలో ఆ అంత్యాక్షరి సీన్ డిజైన్ చేసింది ఆ...

వాట్..గబ్బర్ సింగ్ సినిమాలో ఆ అంత్యాక్షరి సీన్ డిజైన్ చేసింది ఆ తెలుగు హీరోనా..? ఇంత టాలెంట్ ఎక్కడ దాచావ్ బ్రో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా చూస్తే జనాలకు ఎక్కడలేని ఊపు వస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు .. సామాన్య జనాలకి సైతం ఈ సినిమా మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ను కలగజేస్తుంది . మరి ముఖ్యంగా ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా మారింది అంత్యాక్షరి . ఆ సీన్ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ..నవ్వని మనిషి అంటూ ఉండడు .

ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తూనే ఉంటుంది . అయితే ఈ సీన్ ని సినిమాలో పెట్టడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . నార్మల్గా హరిష్ శంకర్ ఈ సీన్ ను చాలా లైట్ గా రాసుకున్నారట . కానీ షూటింగ్ టైంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సీన్ ను ఒక్కొక్క పాటకు జోడిస్తూ కామెడీ చేస్తూ మరింత స్థాయిలో ఎలివేట్ అయ్యేలా చేశారట . అంతేకాదు సినిమా రిలీజ్ అయి హిట్ కొట్టాక ఈ సీన్ గురించి అందరూ మాట్లాడుకుంటుంటే …

స్వయాన ఈ విషయాన్ని హరీష్ శంకరే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . రౌడీ గ్యాంగ్ తో అంత్యాక్షరి ఆడుతూ వారి నుండి నిజం రాబట్టే సీన్స్ ఇప్పటికీ జనాలు చూసి నవ్వుకుంటున్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో సందేహం లేదు. అలా పవన్ తనలోని మరో టాలెంట్ ని కూడా బయటపెట్టాడు. ప్రజెంట్ రాజకీయాలతో పాటు పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు పవన్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news