Moviesపెళ్లి తరువాత వరుణ్ కి అదృష్టం ఈ రేంజ్ లో కలిసి...

పెళ్లి తరువాత వరుణ్ కి అదృష్టం ఈ రేంజ్ లో కలిసి వచ్చింది ఏంటి భయ్యా.. ఏ మెగా హీరోకి దక్కని రేర్ రికార్డ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ ప్రెసెంట్ లావణ్య త్రిపాఠి తో లైఫ్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ జంట ఫైనల్లీ ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి గ్రాండ్ గా అంగరంగ వైభవంగా జరిగింది . ఆ తర్వాత హైదరాబాద్లో కూడా రిసెప్షన్ ఇచ్చారు .

ఆ తర్వాత ఈ జంట హనీమూన్ ని కూడా ఎంజాయ్ చేసింది . దీనికి సంబంధించిన పిక్చర్స్ ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. అయితే పెళ్లి తర్వాత వరుణ్ కి బాగా కలిసి వచ్చినట్టే ఉంది . అంతకు ముందు పెండింగ్లో ఉన్న సినిమాలు సైతం చకచగా పూర్తయిపోతున్నాయి . అంతేకాదు ఈ హీరో ఏకంగా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడు అంటూ తెలుస్తుంది .

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న “ఆపరేషన్ వాలెంటైన్ ” సినిమా బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు . కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్ ని డిసెంబర్ 18న ఉదయం 11: 05 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు . అంతేకాదు కచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అంటూ ప్రామిస్ చేశారు . డిసెంబర్ 8 విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 16న కు పోస్ట్ పోన్ అయ్యింది. తెలుగు – హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఎప్పటినుంచో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నా వరుణ్ కు ఈ సినిమా యాప్ట్ సినిమా అంటూ ప్జిక్స్ అయ్యారట . ఇండస్ట్రీకి వచ్చ్గిన ఇంత తక్కువ టైంలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోగా వరుణ్ రికార్డులు నెలకొల్పాడు. అంతేకాదు లావణ్య త్రిపాఠి వచ్చిన వేళా విశేషం కోరికలన్నీ నెరవేరి పోతున్నాయి అంటున్నారు మెగా ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news