Moviesసురేష్ కొండేటి కి బిగ్ షాక్.. ఇక పై ఏ ప్రెస్...

సురేష్ కొండేటి కి బిగ్ షాక్.. ఇక పై ఏ ప్రెస్ మీట్ లో కనిపించకూడదు..? అందరు కలిసి కట్టుగా ముంచేశారుగా..!!

సురేష్ కొండేటి ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ సినిమా జర్నలిస్టు సంతోషం మ్యాగజైన్ యజమాని. సురేష్ కొండేటి మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి . మరీ ముఖ్యంగా మూవీ ప్రమోషన్స్ మీటింగ్లో పలు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి సెలబ్రెటీలని ఇబ్బంది పెడుతూ ఉంటారు అని జనాలు అనుకుంటారు. మరి కొంతమంది అలాంటి ప్రశ్నలతో సినిమాకి పబ్లిసిటీ పాపులారిటీ తీసుకొస్తూ ఉంటాడు అని అభిప్రాయపడుతూ ఉంటారు.

అభిప్రాయం ఏదైనా కానీ సురేష్ కొండేటి మెయిన్ ఉద్దేశ్యం ఒకటే . ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం. ఎవరు ఏమనుకున్నా సరే సురేష్ కొండేటి అనుకున్నది చేస్తాడు.. అది అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో సురేష్ కొండేటి మీద ఓ వార్త తెగ హల్చల్ చూస్తుంది. ప్రెస్ మీట్ లో ఆయనను బ్యాన్ చేశారు అంటూ ఓ వార్త బయటకు వచ్చింది . ఈ మేరకు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుందట .

ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపై ఏ సినిమా ప్రెస్ మీట్స్ జరిగిన ప్రమోషన్స్ ఈవెంట్స్ లోను సురేష్ కొండేటి హాజరు కాకూడదు అని ఆయనపై బ్యాన్ విధించారు అని పలువురు టాలీవుడ్ హీరోల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది . అయితే ఇదంతా అసత్య ప్రచారమని ఆయనను ఎవరు బ్యాన్ చేయలేదు అని మరి కొంతమంది చెప్పుకొస్తున్నారు . ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news