Moviesత్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రైతుబిడ్డ.. అమ్మాయి ఎవరో తెలిస్తే ఫ్యూజులు...

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రైతుబిడ్డ.. అమ్మాయి ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పల్లవి ప్రశాంత్ అనే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . రైతు బిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి సాదాసీదా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తనదైన స్టైల్ లో గేమ్ ఆడి అందరినీ అలరించి ఫైనల్లి భారీ ఓట్ల మెజారిటీతో కప్ ను కూడా కొట్టేశాడు .

బిగ్ సీజన్ సెవెన్ ట్రోఫీ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ తన పేరుని నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సామాన్య కంటెస్టెంట్.. బిగ్ బాస్ అవార్డు గెలుచుకోవడంతో చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్ . ఎవరైతే హౌస్ లోని కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ కి నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళు హౌస్ నుంచి బయటకు వచ్చాక తెగ ట్రోల్ చేస్తున్నారు జనాలు . కొందరైతే ఏకంగా రాళ్లతో కార్లపై దాడి కూడా చేస్తున్నారు . ఈ విషయం పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ అమ్మానాన్న మాట్లాడుతూ ..”మా వాడికి అంత వస్తుంది.. ఇంత వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతుంది అని ..అదంతా అవాస్తవమని మేము నేలను నమ్ముకొని బతుకుతున్నామని.. మాపై లేనిపోని నిందలు వేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు పల్లవి ప్రశాంత్ కి పెళ్లి చేయాలి అనుకుంటున్నామని ..బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే పెళ్లి చేస్తామని చెప్పుకొచ్చాడు . అంతేకాదు పల్లవి ప్రశాంత్ కి తన సొంత మరదలని ఇచ్చే పెళ్లి చేయాలి అని తన తల్లిదండ్రులు భావిస్తున్నారట ప్రశాంత్ తల్లితండ్రులు . ఇక బిగ్ బాస్ ట్రోఫీ విన్నర్ అవ్వడంతో ప్రశాంత్ పేరు మారుమ్రోగిపోతుంది . ఇదే పెళ్లికి సరైన మూమెంట్ అనుకున్నారో ఏమో త్వరలోనే పెళ్లి చేయడానికి ఫిక్స్ అయిపోయారట ప్రశాంత్ అమ్మానాన్న .అయితే పల్లవి ప్రశాంత్ నీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది..? ఏం చదువుకుంది..? అన్న డీటెయిల్స్ ఇంకా తెలియ రాలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news