Movies' వార్ 2 ' లో ఎన్టీఆర్‌, హృతిక్ కాదు.. అస‌లు...

‘ వార్ 2 ‘ లో ఎన్టీఆర్‌, హృతిక్ కాదు.. అస‌లు విల‌న్ ఆ స్టార్ హీరోనే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే ఎన్టీఆర్ బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టార‌ర్ వార్ 2 సినిమాలో నటిస్తాడు. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు డేట్లు ఇచ్చాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో.. అయితే ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ ఇప్పటివరకు ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ ఇప్పటికే జై లవకుశ సినిమాలో రావణ్‌గా విలన్ పాత్రలో మెప్పించాడు.

ఈ క్రమంలోనే వార్ 2 సినిమాలో కూడా విలన్ గా నటిస్తాడు అంటూ ఒకటే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో అసలు విలన్ ఎన్టీఆర్ కాదని.. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. సంజయ్ దత్ కేజిఎఫ్ సినిమాతో పాటు.. ఇటీవల వచ్చిన విజయ్ లియో సినిమాలోనూ విలన్ గా మెప్పించాడు. ఇప్పుడు వార్తలు ఎవరు ఊహించిన విధంగా.. అసలు ఎవరు ? అనేదానిపై అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఎన్టీఆర్, హృతిక్ రోషన్, సంజయ్ దత్ లాంటి కాంబినేషన్ అంటే మామూలు కాంబినేషన్ కాదని చెప్పాలి. ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్‌లోకి ఫిబ్రవరి నుంచి జాయిన్ అవుతాడు. అయితే డిసెంబర్ 4 నుంచి హృతిక్ రోషన్, సంజయ్ దత్ ఇతర నటీనటుల మీద వచ్చేసీన్‌లను ముందుగా చిత్రీకరిస్తారట. అర్జునుడు, కృష్ణుడు కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే ఎలా ? ఉంటుంది అనే కోణంలో ఈ సినిమా కథ సాగుతుందట. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news