Newsపవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన సినిమా ఇదే.....

పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన సినిమా ఇదే.. ఆయన కెరీర్ లోనే మోస్ట్ స్పెషల్..!

పవన్ కళ్యాణ్ ..ఈ పేరు చెప్తే జనాలకు పూనకాలు వచ్చేస్తాయి. తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఓ స్పెషల్ క్రేజీ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి . ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు . ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అందరికన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పాలి.

చిరంజీవి కన్నా కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఎక్కువ. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రాజకీయాలలో బిజీగా ఉన్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రజాసేవ చేస్తూ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో ఎప్పుడు కూడా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడట. మేకర్స్ ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటాడట.

అది ఎక్కువ ఇచ్చిన సరే తక్కువ వచ్చిన సరే . అయితే ఓ సినిమా విషయంలో అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదట . ఆ సినిమా మరేదో కాదు శంకర్ దాదా జిందాబాద్ . మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ పాత్రలో కనిపిస్తాడు . కేవలం రెండంటే రెండు నిమిషాలే . సెకండ్ హాఫ్ లో వచ్చే పార్ట్ లో పవన్ కళ్యాణ్ సదా లవర్ గా కనిపిస్తాడు. అయితే ఈ సినిమాలో నటించినందుకు వేరే ఏ హీరో అయినా సరే డబ్బులు తీసుకుంటాడు . కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్నపై ప్రేమతో ఈ సినిమా చేశాడట. అంతేకాదు ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news