Newsఈ ఫోటోలోని పాప ఇప్పుడు పెద్ద స్టార్.. మహేశ్ బాబు కి...

ఈ ఫోటోలోని పాప ఇప్పుడు పెద్ద స్టార్.. మహేశ్ బాబు కి ప్రపోజ్ కూడా చేసింది.. గుర్తు పట్టారా..?

రీసెంట్ గా చిల్డ్రన్స్ డే ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు దేశవ్యాప్తంగా ఉండే జనాలు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రెటీస్ కూడా తమ చైల్డ్ హుడ్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి చైల్డ్ హుడ్ మెమోరీస్ ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి ఫోటోలలో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

ఇక్కడ ఈ ఫోటోలో చాలా క్యూట్ గా నవ్వుతున్న పాప ఇప్పుడు పెద్ద స్టార్ . పలువురు స్టార్ హీరో సినిమాలలో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు దాదాపు 40 సినిమాలు 10 వెబ్ సిరీస్ లో కూడా నటించింది . ఇంతకీ ఈమె ఎవరు అని అనుకుంటున్నారా ..? ఈమె మరెవరో కాదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబుకు ప్రపోజ్ చేసిన అమ్మాయి పాత్రలో కనిపించిన అందాల బ్యూటీ అదేనండి ధన్య బాలకృష్ణ.

చిల్డ్రన్స్ డే సందర్భంగా ధన్యబాలకృష్ణ తన చిన్ననాటి ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. తన తండ్రి ఒడిలో కూర్చొని నవ్వుతూ ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది . ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది . ఈ ఫోటో చూసిన జనాలు క్యూట్ నైస్ పిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలాజీ మోహన్ ను ధన్యబాలకృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news