Newsప్రభాస్ - సమంత కాంబినేషన్లో సినిమా.. ట్రయిల్ సక్సెస్ అయినట్టేనా..!

ప్రభాస్ – సమంత కాంబినేషన్లో సినిమా.. ట్రయిల్ సక్సెస్ అయినట్టేనా..!

పై ఫోటోలో స్టిల్స్ చూస్తుంటే రీసెంట్‌గా సమంత ఏం చెప్పాలనుకుంటుంది అన్నది ఎవరికీ ? అర్థం కావటం లేదు. గత వారం రోజులుగా ఆమె వరుస పెట్టి హాట్ ఫోటోలు రిలీజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలతో ఆమె సినీ సమాజానికి ఇన్ డైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే హాట్ ఇమేజ్ అప్పీల్. స్టార్ హీరోల సినిమాల నుంచి, కమర్షియల్ హీరోయిన్ ఫార్మాట్ నుంచి.. సమంత తప్పుకుంది. తప్పుకుంది అనేకంటే పెళ్లి అయ్యాక సహజంగానే అలాంటి ఛాన్సులు రాలేదు.

విడాకుల తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్‌గా మారింది. యశోద, శాకుంతలం, సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. దీంతో ఇప్పుడు ఆమె తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకునేందుకు.. స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ ఛాన్సులు కొట్టేందుకు.. ఇలా హాట్‌ ఫోజులతో రెచ్చగొడుతుందని క్లియర్ గా తెలుస్తోంది. మరోసారి గ్లామర్‌గా కనిపించాలని ఆమె తహతహలాడిపోతోంది. అందుకే ఇలా హాట్ హాట్ ఫోటోలను వరుసగా విడుదల చేస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధికి చికిత్స చేయించుకునే క్రమంలో సినిమాలుకు చిన్న విరామం ఇచ్చిన ఈ బ్యూటీ త్వరలోనే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే ఆమె ఈసారి గ్లామర్ పాత్రలో కూడా నటించే అవకాశం ఉందంటున్నారు. అందుకు ఈ ఫోటోషూట్లు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. అయితే సమంత అభిమానులు, టాలీవుడ్ సినీ జనాలు మాత్రం మళ్లీ పవన్ – సమంత, మహేష్ – సమంత, ప్రభాస్ – సమంత ఇలాంటి కాంబినేషన్ చూడాలని తహతహలాడుతున్నారు.

ఇప్పటికే ఆమె పవన్, మహేష్, ఎన్టీఆర్ స‌ర‌సన నటించేసింది. ఇక మిగిలి ఉంది ప్రభాస్ సరసన మాత్రమే. ఆమె ట్రైల్స్ వర్కౌట్ అయితే ప్రభాస్ స‌ర‌సన హీరోయిన్గా ఛాన్స్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటోలతో ఆమె టాలీవుడ్‌లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వాలని మనసులో కోరికతో ఉన్నట్టు ఆమె ఇస్తున్న సంకేతాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news