Newsసెట్లోనే ఆ హీరోయిన్ చెంప చెళ్లుమ‌నిపించిన మోహ‌న్‌బాబు... అస‌లేం జ‌రిగింది..?

సెట్లోనే ఆ హీరోయిన్ చెంప చెళ్లుమ‌నిపించిన మోహ‌న్‌బాబు… అస‌లేం జ‌రిగింది..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా సీరియస్ గా ఉంటారన్న నానుడి ఎప్పటి నుంచో ఉంది. ఆయన ముక్కుసూటిగా ఉంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ ఉంటారు. ఆయన బ్యానర్ లో సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే చాలు పక్కన ఉన్న వారంతా చాలా పర్ఫెక్ట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటారు. సినిమాలో ఉన్న నటీనటుల దగ్గర నుంచి టెక్నీషియన్ల‌ వరకు మోహన్ బాబు బ్యానర్ లో సినిమా అంటే చాలా క్రమశిక్షణతో టైం టు టైం షూటింగ్‌కు వచ్చేస్తూ ఉంటారు.

మోహన్ బాబు తన ముక్కుసూటి తనం వల్ల ఇండస్ట్రీలో కొన్ని వివాదాలకు కారణమయ్యారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ పై ఆయన చేయి చేసుకున్నారని ప్రచారం కూడా ఉంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ? శిల్పా శివానంద్‌. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. సాక్షి శివానంద్.. తెలుగులో చిరు, మ‌హేష్‌బాబుతో పాటు మోహన్ బాబు సినిమాలలో కూడా నటించింది.

ఆమె చెల్లి శిల్పా శివానంద్‌ను.. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు ఫస్ట్ సినిమా విష్ణులో హీరోయిన్గా ఎంపిక చేశారు. కొంత షూటింగ్ నడిచాక శిల్ప శివానంద్‌ షూటింగుకు ఆలస్యంగా వస్తూ ఇబ్బంది పెడుతుందన్న కారణంతో పాటు.. డైరెక్టర్ చెప్పినట్టు సీన్లు చేయటం లేదన్న కారణంతో మోహన్ బాబు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు సార్లు వార్నింగ్ ఇచ్చిన ఆమె తీరు మారలేదు.

దీంతో మోహన్ బాబు తనకు ఎదురు చెప్పిందన్న కారణంతో శిల్పపై చేయి చేసుకున్న ప్రచారం అప్పట్లో గట్టిగా నడిచింది. ఇండ‌స్ట్రీలోనే కొంద‌రు పెద్ద‌లు ఈ ఇష్యూను సెటిల్ చేశార‌ని అంటారు. అయితే శిల్ప షూటింగ్ సరిగా రాకపోవడంతో పాటు ఆమె డైరెక్టర్‌ను బాగా ఇబ్బంది పెట్టిందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాట నిజమే అని చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఈ విషయం అప్పట్లో సెన్సేషన్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news