Newsసీన్ రివర్స్‌... ' స‌లార్ ' పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ నెగ‌టివ్...

సీన్ రివర్స్‌… ‘ స‌లార్ ‘ పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ నెగ‌టివ్ ట్రెండింగ్‌…!

పాన్ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్ హీరోగా… భారీ సినిమాల‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ సలార్ 1. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు, పృధ్విరాజ్, సుకుమారన్‌, శ్రియ రెడ్డి, రామచందర్ రాజు, ఈశ్వరీరావు వంటి వారు కీలకపాత్రలు చేస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న సలార్ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

మామూలుగా ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాల్సి ఉండగా అనివార్య‌ కారణాల వల్ల క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. వచ్చే నెలలోనే రిలీజ్ అయితే సలార్ పై ఇప్పటికీ అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. సలార్ నుంచి కేవలం ఫస్ట్ లుక్, టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. ఇటీవల ప్రభాస్ బర్త్ డే కి కూడా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ సినిమా మేకర్స్ అయినా హోంబలే ఫిలిమ్స్ వారితో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో నెగిటివ్‌గా ట్రెండ్ చేస్తున్నారు. సంక్రాంతి రిలీజ్ సంబంధించి కొన్ని సినిమాలు అప్డేట్‌లు వరుసగా వస్తున్నాయి. అయితే వచ్చే నెలలోనే సలార్‌ సినిమా రిలీజ్ ఉన్న ఇప్పటికి కూడా మేకర్స్ ఎలాంటి ప్రమోషన్లు స్టార్ట్ చేయకపోవడం తమను బాగా డిసప్పాయింట్‌కు గురిచేస్తుంద‌ని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్లు వైరల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌ అభిమానుల నుంచి నెగిటివ్ యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్‌ గా ఎక్స్ లో ట్రెండ్ అవుతుంది. మరి దీనిపై సలార్‌ మేకర్స్ ఎలా ? స్పందిస్తారో చూడాలి. స‌లార్ సినిమా రెండో పార్ట్ ను వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news