Newsకార్తిక కాబోయే భర్త హీరో నానికి ఏం అవుతాడో తెలుసా.. మంచి...

కార్తిక కాబోయే భర్త హీరో నానికి ఏం అవుతాడో తెలుసా.. మంచి సౌండ్ పార్టీనే పట్టిందిరోయ్..!!

హీరోయిన్ రాధ కూతురు కార్తీక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది . సినిమా ఇండస్ట్రీలోకి జోష్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది . కోలీవుడ్ లో కూడా చాలా తక్కువ సినిమాలు చేసింది .

అయితే తీసిన రెండు మూడు సినిమాలలో తన నటనకు మంచి మార్కులు వేయించుకున్న కార్తీక .. ఆ తర్వాత బిజినెస్ వైపు వెళ్ళింది . కాగా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ రీసెంట్గా నిశ్చితార్థం జరిగింది అంటూ ఎంగేజ్మెంట్ పిక్చర్స్ ని షేర్ చేసింది . దాదాపు 8 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఎంగేజ్మెంట్ ఫిక్స్ షేర్ చేయగానే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి . అయితే ఈ ఫోటోలో భర్త ముఖాన్ని క్లియర్గా చూపించలేదు.

ఫైనల్లీ రీసెంట్గా ఆమె తన కాబోయే భర్త ఫోటో రివీల్ చేసింది . చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా హీరో లెక్కన ఉన్న ఈ అబ్బాయి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . “నిన్ను కలవడం విధి ..నీతో ప్రేమలో పడడం ఒక మ్యాజిక్ .. నీతో కలిసి జీవితం పంచుకోవడానికి కౌంట్ డౌన్ ప్రారంభించాను “అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది .

కార్తీక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు రోహిత్ మీనన్. అయితే ఇతగాడి గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రివీల్ కాలేదు . కానీ ఇతగాడు మాత్రం మంచి టాలెంటెడ్ పర్సన్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇతను కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కీ..తెలుగు హీరో నాని కు క్లోజ్ ఫ్రెండ్ అంటూ కూడా తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో కార్తీక-రోహిత్ మీనన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news