Newsబాలయ్యకు నో చెప్పిన ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఆ గ‌తి ప‌ట్టిందా...!

బాలయ్యకు నో చెప్పిన ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఆ గ‌తి ప‌ట్టిందా…!

స్టార్ హీరో బాలకృష్ణకు ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తోందని బాలయ్య ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు విభిన్నమైన కథలతో తెరకెక్కి మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అయితే ఈ హిట్ సినిమాలలో నటించడానికి కొంతమంది హీరోయిన్లు నో చెప్పారు. ఆ స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

అఖండ సినిమా కోసం మొదట సంప్రదించిన హీరోయిన్లలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒక హీరోయిన్ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుని వరుస ఆఫర్లు అందుకునే హీరోయిన్ కాగా మరో హీరోయిన్ మేకప్ కూడా అవసరం లేకుండా అందంగా కనిపించే హీరోయిన్ కావడం గమనార్హం. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక, ఆఫర్లు ఇచ్చేవాళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

బాలయ్య జాతకాలను, మూహూర్తాలను బాగా నమ్ముతారనే సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాలకు నో చెప్పిన హీరోయిన్లకు తగిన శాస్తి జరిగిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆ హీరోయిన్లు ఇప్పుడు బాలయ్యతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నా బాలయ్య మాత్రం ఆ హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. అవమానించిన హీరోయిన్లకు టైమ్ చూసి బాలయ్య దెబ్బ కొడుతున్నారు.

సీనియర్ హీరోలలో వరుస విజయాలు సొంతం చేసుకున్న హీరో బాలయ్య మాత్రమే కాగా ఈ హీరో బాబీ సినిమా 100 కోట్ల రూపాయలు లేదా అంతకుమించి షేర్ కలెక్షన్లు అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్యకు సూట్ అయ్యే యాక్షన్ సీన్లను బాబీ ప్లాన్ చేశారని ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు న భూతో న భవిష్యత్ అనే విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news