టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాల్లో సక్సెస్ సాధించారు. తారకరత్న కూడా నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే నందమూరి కుటుంబంలో ప్రతి నాలుగేళ్లకు ఊహించని విధంగా ఒకరు మరణిస్తూ అభిమానులకు బాధను మిగులుస్తున్నారు.
హరికృష్ణ కొడుకు జానకిరామ్ 2014 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన అభిమానులను షాక్ కు గురి చేసింది. నల్గొండ జిల్లా ఆకుపాము వద్ద జరిగిన ఈ ఘటన ఫ్యాన్స్ కు ఎంతో బాధను కలిగించింది. ఈ ఘటనను మరిచిపోయిన కొన్నేళ్ల తర్వాత 2018లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ మృతి చెందడం గమనార్హం. హరికృష్ణ తలకు బలమైన గాయం కావడం వల్ల ఆయన ప్రాణాలను కోల్పోయారు.
ఈ ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత 2023 సంవత్సరం ఫిబ్రవరి నెలలో తారకరత్న గుండె సంబంధిత సమస్యల వల్ల మృతి చెందారు. నాలుగేళ్లకు అటూఇటుగా నందమూరి కుటుంబంలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలు నందమూరి కుటుంబ సభ్యులకు మిగిల్చిన బాధ అంతాఇంతా కాదు. తారకరత్న కుటుంబం ఇప్పుడిప్పుడే ఈ బాధ నుంచి కోలుకుంటోంది.
తారకరత్న భార్య, కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా బాలయ్య తన వంతు సహాయం చేస్తున్నారని తెలుస్తోంది. తారకరత్న మరణానికి ముందు జూనియర్ ఎన్టీఆర్ నెలకు 4 లక్షల రూపాయల చొప్పున సహాయం చేశారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తారకరత్న కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా దేవుడు చూసుకోవాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.