Moviesయూట్యూబ్‌కి ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఆ నటులు అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా… ఇంత...

యూట్యూబ్‌కి ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఆ నటులు అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా… ఇంత ఘోర‌మా..!

ప్రస్తుతం అంతా డిజిటల్ హవా నడుస్తోంది. మల్టీప్లెక్స్ వచ్చాక థియేటర్స్ కి వాల్యూ ఎలా తగ్గిపోయిందో..యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక శాటిలైట్ ఛానల్స్ కి అలా వాల్యూ తగ్గిపోయింది. డిజిటల్ రంగంలో ముందుగా అడుగుపెట్టింది ఐడ్రీం మీడియా. వాళ్ళ తర్వాతే లెక్కలోకి తీసుకోలేనన్ని యూట్యూబ్ ఛాన్స్ పుట్టుకొచ్చాయి. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత నష్టం అని దర్శకుడు శంకర్ రోబో సిరీస్ ద్వారా చెప్పారు

నిజమే, యూట్యూబ్ ఛానల్స్ వల్ల లాభం కంటే కూడా నష్టం ఎక్కువగా జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఉపయోగించినా అది మంచికోసమైతే పరవాలేదు. కానీ, కాంట్రవర్సీలకైతే అంతా సర్వ నాశనం అవుతుంది. యూట్యూబ్ ఛానల్స్ అంటే సినీ తారలకి ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. శాటిలైట్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ అంటే అంత త్వరగా టైం ఇచ్చేవారు కాదు. కానీ, యూట్యూబ్ ఛానల్స్ అంటే మాత్రం ఒకే చెప్పేవారు.

కానీ, శ్రీరెడ్డి లాంటి కొందరు డిజిటల్ మీడియం ని నాశనం చేశారు. ఆమె పిలిచిన యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి సినిమా వాళ్ళ గురించి నోటికొచ్చింది మాట్లాడి పెద్ద డ్యామేజ్ చేసింది. ఆమె నిజంగా ఇండస్ట్రీ ప్రముఖుల వద్ద దారుణంగా మోసపోయింది. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు. కానీ, ఆమె వాడిన భాష వల్ల, పదాల వల్ల ఫిల్మ్ ఛాంబర్ లో ఏకంగా షరతులు విధించారు. సినీ సెలబ్రిటీస్ ప్రతీ యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వకూడదని నిబంధనలు పెట్టారు.

కొన్ని పెద్ద ఛానల్స్ లో ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఉంటున్నారు కాబట్టి నెట్టుకొస్తున్నాయి. అయితే, ఇప్పుడు కొందరు సీనియర్ సినీ తారలను ఇంటర్వ్యూలకి పిలిస్తే 5 వేలు నుంచి 10 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఇంటర్వ్యూ ఇస్తే మీకు డబ్బులొస్తున్నాయి. మరి మాకేంటి అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. దాంతో ఛానల్ వాళ్ళు ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇచ్చి సెలబ్రిటీలతో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఇది కొత్తగ వచ్చిన ఛానళ్ళపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news