Newsఆలియాను త‌ట్టుకోలేక ఎన్టీఆర్ సినిమా నుంచి గెట‌వుట్ అన్నారా...!

ఆలియాను త‌ట్టుకోలేక ఎన్టీఆర్ సినిమా నుంచి గెట‌వుట్ అన్నారా…!

బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఆలియా భట్‌ని మన టాలీవుడ్ మాత్రం తట్టుకోలేకపోయిందట. ఆమె తెలుగులో స్టార్ హీరోల సరసన నటించడానికి ఎంతో ఆరాటపడుతుందని ఒకప్పుడు బాగా వార్తలు వచ్చాయి. మహేశ్ భట్ కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. కాస్తో కూస్తో టాలెంట్ ఉండటంతో అక్కడ బాగానే పాపులర్ అయింది.

చెప్పాలంటే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరు పెదవి విరిచారు. కానీ, ఆ తర్వాత తన కోసమే కథలు తయారయ్యాయి. అంతగా తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. గంగూభాయ్ లాంటి సినిమాలో ఆలియా భట్ పర్ఫార్మెన్స్ ని బాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా మెచ్చుకున్నారు. అదే సమయంలో ఆలియా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టాలీవుడ్ ఆఫర్ వచ్చింది.

అది కూడా ఏకంగా రాజమౌళి సినిమా. రాం చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ స్థాయిలో వచ్చి ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం ఆలియా ఇచ్చిన డేట్స్ చాలా తక్కువ. కానీ, రెమ్యునరేషన్ మాత్రం చుక్కల్లో చూపించింది. కేవలం బాలీవుడ్ లో మార్కెట్ కోసమే తప్ప ఆలియాకి అంత ఇవ్వాల్సిన అవసరం లేదని అందరూ రాజమౌళిని కామెంట్స్ చేశారు.

అదే పాత్రకి రాజమౌళి ఇచ్చిన రెమ్యునరేషన్ లో సగానికి సగం ఇస్తే అంతకంటే నేచురల్‌గా పర్ఫార్మ్ చేసే క్రేజీ హీరోయిన్ దొరికేదని చెప్పుకున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు. ఎందుకంటే ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుస్తున్న దేవర సినిమా కోసం ముందుగా అనుకున్నది ఆలియానేనట. కానీ, ఆలియా ఈ సినిమా క్వాల్షీట్స్ ఇస్తే అడిగిన రెమ్యునరేషన్‌తో తెలుగులో నాలుగైదు మీడియం బడ్జెట్ సినిమాలు చేయవచ్చునని టాక్ ఉంది. అందుకే, ఆలియా అంటే మన తెలుగు మేకర్స్ ఒద్దురా నాయనా అంటున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news