Newsఅనుష్క నాగార్జున‌కు ఎక్క‌డ ప‌డిపోయిందంటే...!

అనుష్క నాగార్జున‌కు ఎక్క‌డ ప‌డిపోయిందంటే…!

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున – స్వీటీ బ్యూటీ అనుష్క మధ్య స్నేహం.. అంతకుమించిన బంధం గురించి రకరకాల వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి. అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగ టీచర్. ఆమె అక్కినేని నాగచైతన్యకు యోగ టీచర్గా ఉండేవారు. భూమిక భర్త భ‌ర‌త్ ఠాగూర్‌ దగ్గర ఆమె యోగ నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే చైతుకు యోగా నేర్పే క్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెను చూసి నాగార్జున హీరోగా పూరి దర్శకత్వం వహించిన సూపర్ సినిమాలో రెండో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో అనుష్క హాట్ హాట్ అందాలకు తెలుగు జనాలు ఫిదా అయిపోయారు.

అక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస‌ పెట్టి నాలుగైదు సంవత్సరాలలో తెలుగులోనూ.. అటు తమిళంలోనూ స్టార్ హీరోలతో నటించి తిరుగులేని హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి ఆమె చాలా సినిమాలలో నటించింది. సూపర్ తో మొదలు పెడితే డాన్ – రగడ – ఢ‌మరుకం – శ్రీ వెంకటేశాయ నమః సినిమాలలో కలిసి నటించారు. ఇదిలా ఉంటే నాగార్జున – అనుష్క బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో పాటు అంతకుమించిన బంధం వీరిద్దరి మధ్య ఉండటానికి కారణం ఏంటంటే ?కెరీర్ ప్రారంభంలో అనుష్క.. నాగార్జున మీద పూర్తిగా డిపెండ్ అయ్యింది.

ఆమెకి స్టార్‌డం వచ్చాక ఆమె సంపాదించిన కోట్లాది రూపాయలను నాగార్జునతో కలిసి అనేక వ్యాపారాల‌లో పెట్టుబడి పెట్టింది. అవన్నీ బాగా కలిసి వచ్చాయి. ఆమె పెట్టుబడులు అన్నీ డబుల్, త్రిబుల్‌ అయ్యాయి. దీంతో పాటు పర్సనల్గా నాగార్జున.. అనుష్క విషయంలో చాలా కేర్ తీసుకునేవాడు. ఇవన్నీ ఆమె నాగర్జున మీద ప్రేమ పెంచుకోవడానికి ప్రధాన కారణం అయ్యాయని ఇండస్ట్రీ జనాలు చెవులు కోరుక్కుంటున్నారు. నిజానికి అనుష్క – నాగార్జున వెండితెర మీద కనిపించినప్పుడు వారిద్దరి కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.

నాగార్జునతో కలిసి అనుష్క ఇటు అమరావతి తో పాటు హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడులు పెట్టిందన్న ప్రచారం ఉంది. ఇలా ఎంతో నమ్మకంతో ఉండే వీరిద్దరి మధ్య కొన్ని విషయాల్లో మాట పట్టింపులు.. పొరపచ్చలు రావడంతో ఆ తర్వాత ఒకరికొకరు మాట్లాడుకోలేనంత గ్యాప్ పెరిగిపోయిందని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు. మరి అసలు నిజాలు ఏమిటో అనుష్క, నాగార్జునకే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news