Newsవెంక‌టేష్ పెద్ద కుమార్తె అశ్రిత ఏం చేస్తుందో తెలుసా... !

వెంక‌టేష్ పెద్ద కుమార్తె అశ్రిత ఏం చేస్తుందో తెలుసా… !

టాలీవుడ్ లో బలమైన ఫ్యామిలీలలో ఒకటే అయిన దగ్గుబాటి ఇంట‌ మరోసారి పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. రెండేళ్ల క్రితం సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా తన ప్రియురాలు మిహికా బజాజ్ ను పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే సురేష్ బాబు తమ్ముడు స్టార్ హీరో వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత ప్రేమ వివాహం జరిగింది. ఇక ఇప్పుడు వెంకటేష్ రెండో కుమార్తె హ‌య‌వాహిని ఎంగేజ్మెంట్ జరిగింది. వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత‌ ప్రేమ వివాహం చేసుకున్నారు.

తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబానికి చెందిన మనవడిని ఆశ్రిత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఖ‌మ్మం మాజీ ఎంపీ, ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ కీ లీడ‌ర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ కుటుంబంతో వియ్యంకుడి రూపంలో బంధుత్వం ఉంది. ఇక వెంకటేష్‌ రెండో కుమార్తె హ‌య‌వాహని వివాహం విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో జరగనుంది. విజయవాడకు చెందిన డాక్టర్ల కుటుంబానికి చెందిన ఇంటికి హ‌య‌వాహని కోడలిగా వెళ్లనుంది.

ఇటీవలే జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబాలు హాజరయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎవరో కాదు ? వెంకటేష్ భార్య దగ్గుపాటి నీరజకు స్వయానా మేనమామ కావటం విశేషం. ఇక సోషల్ మీడియాలో వెంకటేష్ కుటుంబం గురించి పెద్దగా వివరాలు ఎప్పుడూ అందుబాటులో ఉండవు. తన పిల్లల కెరీర్ తో పాటు.. ఇతర వ్యక్తిగత విషయాలలో వెంకటేష్ చాలా జాగ్రత్తగా ఉంటారు.

సినిమా పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రభావం తమ పిల్లలపై లేకుండా వెంకటేష్ జాగ్రత్త పడుతూ ఉంటారు. వెంకటేష్ – దగ్గుబాటి నీరజ‌ 1985లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు పెద్ద కుమార్తె ఆశ్రిత, రెండవ కుమార్తె హ‌య‌వాహని, మూడో కుమార్తె భావన.. ఈ ముగ్గురు కుమార్తెల తర్వాత అర్జున్ అనే కుమారుడు జన్మించాడు. వెంక‌టేష్‌కు కుమారుడు అర్జున్‌ 2002లో జన్మించారు.

ఇక పెద్ద కుమార్తె అశ్రిత వివాహం 2019లో జైపూర్లో అంగరంగ వైభవంగా జరిగింది. వినాయక్ రెడ్డి ఆమె భర్త అశ్రిత ఇన్ఫినిటీ ప్లేటర్ అనే బేకరీ చైన్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆమె తన భర్తతో కలిసి స్పెయిన్లో నివసిస్తున్నారు. ఈ కుటుంబానికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news