Newsటాలీవుడ్‌ది ఒకే మాట ఒకే బాట‌... ర‌ష్మిక వ‌ద్దే వ‌ద్దు... శ్రీలీలే...

టాలీవుడ్‌ది ఒకే మాట ఒకే బాట‌… ర‌ష్మిక వ‌ద్దే వ‌ద్దు… శ్రీలీలే ముద్దు..!

ఎస్ ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఒకే బాట ఒకే మాట మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల నుంచి మిడిల్ రేంజ్ హీరోల సినిమాల వరకు హీరోల పక్కన నటించే హీరోయిన్ ఎవరు ? ఉన్నారు అని ప్రశ్నిస్తే శ్రీలీల – రష్మిక – పూజా హెగ్డే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పూజ హెగ్డే ఎప్పుడైతే బాలీవుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసిందో ఆమెను పట్టించుకోవడం మానేశారు. దీనికి తోడు రష్మిక ఆ తర్వాత శ్రీలీల‌ రాగానే పూజను సైడ్ చేసేసారు.

ఇప్పుడు పోటీ అంతా రష్మిక – శ్రీలీల మధ్య నడుస్తోంది. రష్మిక కూడా తెలుగు జనాలు ఆమెకు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన బాలీవుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. దీంతో వెంటనే ఆ ఛాన్స్ అందిపుచ్చుకున్నా శ్రీలీల‌ పదుల సంఖ్యలో సినిమాలతో దూసుకుపోతోంది. ఒకప్పుడు రష్మికకే ఛాన్సులు ఇవ్వాలి అని పని కట్టుకుని కూర్చున్న హీరోలు, దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు ఆమెను పక్కన పెట్టేస్తున్నారు. ఆమెకు ఇవ్వాలనుకున్న ఛాన్సులు కూడా శ్రీలీలకే ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీలీల చేతిలో ఏకంగా 10కి పైగా సినిమాలు ఉన్నాయి.

రష్మిక – విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో సినీ జనాలకు మాత్రమే కాదు. ట్రేడ్ వర్గాల్లోనూ ఎన్నో అంచనాలు ఉంటాయి. త‌న‌ సినిమాలో రష్మిక హీరోయిన్ అంటే విజయ్ దేవరకొండ అస్సలు వదులుకోడు. అయితే విజయ్ గౌతమ్ – తిన్న‌నూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో రష్మికను హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు. అసలే విజయ్ క్రేజ్‌ అంతంత మాత్రమే ఉంది. ఖుషి సినిమా సూపర్ హిట్ అయినా.. సమంత లాంటి హీరోయిన్ ఉన్నా అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాలేదు.

రష్మికతో ఇంతకుముందే రెండు సినిమాలు చేశాడు. శ్రీలీలది.. విజయ్ ది ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది. అందుకే రష్మిక‌ను పక్కన పెట్టేసి మరి శ్రీలీలను తీసుకున్నారు. రష్మికే విజయ పక్కన నటిస్తుంద‌న్న ప్రచారం జరిగింది.. దీనిని నిర్మాత నాగవంశీ కూడా ఖండించారు. తమ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. ఏది ఏమైనా ఇప్పుడు టాలీవుడ్ లో రష్మీక‌కు కావలసిన వాళ్ళ నోట నుంచి కూడా రష్మిక‌ వద్దు శ్రీలీల ముద్దు అన్నమాట ఎక్కువగా వినిపిస్తుంది అనేందుకు ఇదే పెద్ద నిదర్శనం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news