News' టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ' ర‌న్ టైం... సినిమా చూడాలంటే పెద్ద...

‘ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ‘ ర‌న్ టైం… సినిమా చూడాలంటే పెద్ద ప‌రీక్ష‌రా బాబు…!

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ త్రిల్లింగ్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిస‌న‌న్‌ సోదరి నుపూర్ స‌న‌న్ హీరోయిన్గా.. గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి దొంగాట ఫేం వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించింది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని ఆడియన్స్ ని ఆకట్టుకుని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశాయి.

దసరా కానుకగా ఈ నెల 20న టైగర్ నాగేశ్వరరావు థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సెన్సార్ నుంచి యు / ఏ సర్టిఫికెట్ దక్కించుకున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ రన్ టైం కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ మొత్తం 181 నిమిషాలు అంటే.. మూడు గంటల ఒక్క నిమిషాల లాంగ్ రన్ టైం కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవల వచ్చిన సినిమాలలో ఇదే భారీ రన్‌ టైం అని చెప్పాలి. అంటే 181 నిమిషాల పాటు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను చూడాలి అంటే చాలా సహనం ఉండాలి.. సినిమా ఎంతో బాగుంటే తప్ప అంతసేపు థియేటర్లలో కూర్చుని ప్రేక్షకులు సినిమా చూడటం కష్టం. మరి రవితేజ – వంశీ టైగర్ నాగేశ్వరరావు తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశారు ఏంటి అన్నది ఈ నెల 20న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news