Newsఅన్‌స్టాప‌బులో ' భ‌గ‌వంత్ కేస‌రి ' టీం అన్‌స్టాప‌బుల్ ర‌చ్చ‌... రిలీజ్‌కు...

అన్‌స్టాప‌బులో ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ టీం అన్‌స్టాప‌బుల్ ర‌చ్చ‌… రిలీజ్‌కు ముందే మొద‌లు…!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మరో క్రేజీ హీరోయిన్ శ్రీలీలా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది, సంయుక్తంగా నిర్మించారు.

బాలయ్య కెరీర్ లోనే 100 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన తొలి సినిమాగా భగవంత్‌ కేసరి రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సినిమాకు మొత్తం రు. 120 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక బుల్లితెరపై ఆహా ఓటీపీ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే అన్ స్టాపబుల్‌ రెండు సీజన్లో హోస్ట్ గా బాలయ్య అదరగొట్టేశాడు.

తాజాగా బాలకృష్ణ అనుస్టాప‌బుల్ లిమిటెడ్ ఎడిషన్ ద్వారా మరోసారి ఆడియన్స్ ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ లెవెల్ లో అక్టోబర్ 17న ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ లో భ‌గవంత్‌ కేసరి టీం ప్రత్యేకంగా సందడి చేయనుంది. హీరోయిన్ కాజల్ – శ్రీ లీల – విలన్ పాత్రధారి అర్జున్ రాంపాల్ – డైరెక్టర్ అనిల్ రావు పూడి ఈ ఎపిసోడ్లో సందడి చేయనున్నారు.

ఈ ఎపిసోడ్ ఫిక్స్ ఆహా వారు గ‌త రాత్రి అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇవి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా భ‌గ‌వంత్ కేస‌రి సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు నుంచే బుల్లితెరపై అన్‌స్టాప‌బుల్ రచ్చ అన్‌లిమిటెడ్ గా మొదలుకానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news