News' భ‌గ‌వంత్ కేస‌రి ' ర‌న్ టైం లాక్ ... బాల‌య్య...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ర‌న్ టైం లాక్ … బాల‌య్య యాక్ష‌న్ డీసెంట్ ఎంజాయ్‌…!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా భగవంత్‌ కేసరి. దసరా కానుకగా గట్టి పోటీ మధ్యలో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా… మరో క్రేజీ హీరోయిన్ శ్రీలీలా బాలయ్య కూతురుగా నటించారు. ఈ సినిమాను టాలీవుడ్ లో అసలు అపజయం అన్నది లేకుండా దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా ఇటు బాలయ్య అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ల‌తో ఉన్నారు. దీంతో భగవంత్ కేసరి సినిమాకు బాలయ్య కెరీర్ లోనే గతంలో ఏ సినిమాకు జర‌గ‌నట్టుగా రు. 100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తాజాగా వచ్చిన ట్రైలర్ తర్వాత సినిమాపై ఇప్పటివరకుఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి. ఈ సినిమా రన్ టైం కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది.

భ‌గ‌వంత్ కేస‌రి రన్ టైం అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేసినట్టు సమాచారం. టోటల్‌గా 155 నిమిషాల నిడివితో భగవంత్‌ కేసరి థియేటర్లలోకి వస్తుంది. అంటే సుమారు రెండు గంటల 35 నిమిషాల పాటు ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. ఇది చాలా డీసెంట్ ర‌న్ టైం అని చెప్పాలి.

సినిమాను చాలా క్రిస్పీగా కట్ చేశారని… పెద్దగా ల్యాగ్ కూడా ఉండదని తెలుస్తోంది. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమాను హరీష్ పెద్ది – సాహు గార‌పాటి సంయుక్తంగా నిర్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news