Newsబాల‌య్య ' భ‌గవంత్ కేస‌రి ' కి మ‌హేష్ ' గుంటూరు...

బాల‌య్య ‘ భ‌గవంత్ కేస‌రి ‘ కి మ‌హేష్ ‘ గుంటూరు కారం ‘ కు ఉన్న యూనివ‌ర్స్ లింక్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి కనుకుగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమాలో మహేష్ పాత్ర గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు తాజాగా రిలీజ్ అయిన బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాలో బాలయ్య పాత్రకు ఒక కామన్ లింక్ ఉంటుందట.

ఈ సినిమాతో మహేష్ కొత్త జనాల్లోకి అడుగుపెడుతున్నాడు. పెద్దరికం సంతరించుకున్న మిడిల్ ఏజ్ తండ్రి పాత్రలో మహేష్ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. చాలా గ్యాప్‌ తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఎమోషనల్ పాత్రలో కనిపించబోతున్నాడు. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పాత్రలో మిడిల్ ఏజ్ తండ్రి పాత్రలో మహేష్ కనిపిస్తాడంటే.. తాజాగా వచ్చిన భగవంత్‌ కేసరి సినిమాలోని బాలయ్య వయసు మళ్ళిన తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలా ఈ రెండు సినిమాలలో మహేష్ – బాలయ్య పాత్రల మధ్య ఈ కామ‌న్ పోలిక ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక గుంటూరు కారం కథ మహేష్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడేలాగా సరికొత్తగా ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట. మహేష్ కెరీర్ లో ఈ సినిమా 28వ సినిమాగా తెరకెక్కుతోంది. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిన‌బాబు ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news