Moviesఅతి ఛండాలమైన పని చేసిన జాన్వికపూర్ ..బూతులు తిడుతున్న నందమూరి ఫ్యాన్స్..ఏమైందంటే..?

అతి ఛండాలమైన పని చేసిన జాన్వికపూర్ ..బూతులు తిడుతున్న నందమూరి ఫ్యాన్స్..ఏమైందంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ ఏవిధంగా హీరోయిన్స్ పై ఒక కన్ను వేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము.. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై ఎప్పుడు కొన్ని కళ్ళు ఫోకస్ చేస్తూనే ఉంటాయి. అయితే తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ ..జాన్వి కపూర్ మాత్రం ఒక పనిచేసి ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కోపానికి బలైయ్యే పరిస్థితి తెచ్చుకుంది . ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో వైరల్ గా మారింది . జాన్వి కపూర్ .. దేవర సినిమా ద్వారా తెలుగులోకి డెబ్యూ ఇవ్వబోతుంది .

ఈ సినిమా పుణ్యమా అంటూ ఆమె ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది . ఇప్పటివరకు జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నటించింది . కానీ ఎక్కడా కూడా ఆమె పేరు మారుమ్రోగిపోయే స్థాయిలో ఉన్న సినిమాలను అందుకోలేకపోయింది. మొదటి సినిమాతోనే తెలుగులో ఎన్టీఆర్ తో ఇవ్వబోతుంది అనగానే ఫాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకున్నారు . కాగా దేవర సినిమాపై జాన్వి కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది . రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ .

అయితే ఆ సాంగ్ గురించి ఏం పట్టించుకోకుండా పుష్ప2 సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వగానే లైక్ కొట్టింది . దీంతో సోషల్ మీడియాలో ఇది ఓ సెన్సేషన్ గా మారిపోయింది . జాన్వి కపూర్ దేవర సినిమాను లైట్గా తీసుకుంది అని ..అందుకే ఆమె ఈ సినిమాను పట్టించుకోవడం లేదు అని పుష్ప2 పైన తన ఫోకస్ మొత్తం పెట్టింది అని ..ఆమెకు అసలు ఎన్టీఆర్ అంటే రెస్పెక్ట్ లేదు అని జనాలు మండిపడుతున్నారు. జాన్వి కపూర్ సరదాగా ఇలా లైక్ చేసి ఉండొచ్చు కానీ తాను హీరోయిన్గా నటిస్తున్న సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తే స్పందించకపోవడం.. నిజంగా బాధాకరమైన విషయమే అంటున్నారు అభిమానులు. జాన్వీకి తెలియదో లేక తెలిసి కావాలని చేసిందో అది ఆమెకే తెలియాలి ..మొత్తానికి సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news