Moviesవైష్ణవి చైతన్య "లవ్ మీ" మూవీ రివ్యూ: సినిమాకి ఎక్కువ..సీరియల్ కి...

వైష్ణవి చైతన్య “లవ్ మీ” మూవీ రివ్యూ: సినిమాకి ఎక్కువ..సీరియల్ కి తక్కువ.. అసలిదే మిస్ చేశావ్ కదారా డైరెక్టర్..!

ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బేబీ సినిమా ద్వారా హ్యూజ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . ఇప్పుడు ఆమె నటించిన రెండవ సినిమా లవ్ మీ . దిల్ రాజు వారసుడు ఆశీష్ హీరోగా నటించిన ఈ సినిమా కొద్దిసేపటి కిత్రమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . కాగా ఫుల్ హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా అభిమానులను మెప్పించిందా ..? లేక బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు మనే టాక్ దక్కించుకుందా..? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసారు దిల్ రాజు . అంతే కాదు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య యంగ్ హీరో ఆశిష్ కూడా తమదైన స్టైల్ లో సినిమాను ప్రమోట్ చేయడానికి బాగా కష్టపడ్డారు . అయితే సినిమాలో కథ కీలకంగా లేకపోతే ఎంత ప్రమోషన్స్ చేసిన ఫ్లాప్ అవుతుంది అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా కథ కాన్సెప్ట్ జనాలకి అర్థం కావడం లేదు . పైగా అక్కడక్కడ కామెడీ జోనర్లు పండించిన అసలు ఏంటి కథ అనే విషయం చెప్పడంలో సస్పెన్స్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యాడు . కామెడీ జోనర్ అనగానే అందరూ ఏదో ఊహించుకున్నారు .

అయితే సినిమాకి అంత సీన్ లేదు అంటూ మొదటి షో తోనే తెలిసిపోయింది. అంతేకాదు వైష్ణవి చైతన్య పెర్ఫార్మెన్స్ ఆశిష్ పర్ఫామెన్స్ బాగానే ఉన్నా డైరెక్టర్ కధా పాయింట్ రాసుకున్న విధానాన్ని కన్ఫ్యూషన్ గా అభిమానులకు తెలియజేయడంతో సస్పెన్స్ మొత్తం ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేలా ఉంది . థియేటర్లో ఆ సీన్ రన్ అవుతుంటే నెక్స్ట్ ఇలా జరగబోతుంది అంటూ బ్యాక్ గ్రౌండ్ నుంచి జనాలు అరుపులు కేకలతో ఆసీను ముందుగానే పసిగట్టేస్తున్నారు.

దీంతో ఆ సస్పెన్స్ మొత్తం దొబ్బేసింది. అంతేకాదు అనుకున్న విధంగా కూడా ఎక్కడ సినిమా రీచ్ కాలేకపోయింది.. ఇలాంటి కాన్సెప్ట్ మూవీలు ఇండస్ట్రీలో చాలా వచ్చాయి . చాలా హిట్ అయ్యాయి ఫట్ అయ్యాయి ..అయితే ఈ సినిమాలో అంతగా చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లేకపోవడంతో డైరెక్టర్ పరంగానే ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటున్నారు జనాలు . ఆశిష్ వైష్ణవి చైతన్య పర్ఫామెన్స్ ను బాగానే కనపరిచిన డైరెక్టర్ రాసుకున్న సీన్స్ పేలక పోవడంతో సినిమా అంతంతమాత్రంగానే టాక్ దక్కించుకుంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో.. మొత్తానికి ఫస్ట్ సినిమాతో హిట్టు అందుకున్న వైష్ణవి సెకండ్ సినిమాతో మాత్రం ఫట్ అనే టాకే దక్కించుకుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news