Newsప‌వ‌న్ ప‌క్క‌న రుక్మిణి ... ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌.. అస‌లు...

ప‌వ‌న్ ప‌క్క‌న రుక్మిణి … ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌.. అస‌లు ఎవ‌రామే..!

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఓ మహిళ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో ఆమె ఎవరు ? ఆమె పవన్ పక్కన ఏదైనా సినిమాలో నటిస్తుందా ? ఆమెకు పవన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఇదే విషయం సోషల్ మీడియాలో బాగా చర్చికి వస్తోంది. పవన్ పక్కన పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రుక్మిణి. ఆమె సినిమా హీరోయిన్ కాదు. ఆమె జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, రాజకీయ వ్యవహారాలను దగ్గరుండి చూస్తున్నట్టు తెలుస్తోంది.

రుక్మిణి చాలా తక్కువ సమయంలోనే జనసేన కీలక నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె జ‌న‌సేన వీర‌మ‌హిళల్లో కీల‌కంగా ఉంటున్నారు. రుక్మిణి ప్రసన్నం చేసుకుంటే పవన్ దగ్గరికి చేరుకోగలమనే స్థాయికి ఆమె ఎదిగిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన రుక్మిణి లండన్లో ఉండేవారు. ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ. జనసేన వీర మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. లండన్ లో ఉండే రుక్మిణి 2022లో హైదరాబాద్‌కు మకాం మార్చారు

హైదరాబాదులో జనసేన కార్యాలయ బాధ్యతలు కూడా రుక్మిణి దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. జనసేన పార్టీలో రోజురోజుకీ రుక్మిణి ప్రభావం బాగా ఎక్కువ అవుతున్నట్టు కూడా చర్చ‌ జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో ఆమె మహిళా కోటాలో జనసేన నుంచి ఏపీలో ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news