Newsషాప్ ఓపెనింగ్‌లో సితార బుగ్గ గిల్లిన వ్య‌క్తి... సితార రియాక్ష‌న్ ఇదే..!

షాప్ ఓపెనింగ్‌లో సితార బుగ్గ గిల్లిన వ్య‌క్తి… సితార రియాక్ష‌న్ ఇదే..!

ఘట్టమనేని వారసురాలు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తన తండ్రి క్రేజ్ కంటిన్యూ చేస్తున్న సితారకు చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు వచ్చింది ఇంకా చెప్పాలి. అంటే ఈ అమ్ముడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల ఆమె ఓ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు గాను కోటి రూపాయల పారితోష‌కం ఇచ్చారు.

అయితే దానిని సితార చారిటీకి ఇచ్చేశారు. ఇటు చిన్న వయసులోనే తండ్రి అడుగుజాడల్లో గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయురాలుగా గుర్తింపు తెచ్చుకుంటుంది. తాజాగా తన తల్లి న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌తో కలిసి హైదరాబాద్ కూకట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డ్ లోని నెక్సస్ మాల్ లో ఏర్పాటు చేసిన బొమ్మను కొలువు ప్రారంభోత్సవానికి వెళ్ళింది.

మహేష్ కూతురు అక్కడికి రావడంతో ఆమెతో ఫోటోలు దిగేందుకు చాలామంది ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఒక బామ్మ సితార బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంది. అయితే సితార నవ్వుతూ ఆ భామ వంక చూసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సితారను ఈ వయసులో చూస్తుంటే స్టార్ హీరోయిన్లను మించిన అందంతో చాలా క్యూట్ గా కనిపిస్తోంది.

సితార గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వాలన్న కలలు కంటోందని.. ఆమె లక్ష్యాలకు అనుగుణంగానే తల్లిదండ్రులు ఇద్దరు ఆమెను ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆమె గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వడం అంటే సినిమాల్లోకి వస్తుందా లేదా.. ఈ రంగంలోనే బుల్లితెరపై ఎంట్రీ ఉంటుందా ? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news