Newsన‌య‌న‌తార అందం నేచుర‌ల్ కాదా... మొత్తం ప్లాస్టిక్ స‌ర్జ‌రీలే... బ‌య‌ట ప‌డ్డ...

న‌య‌న‌తార అందం నేచుర‌ల్ కాదా… మొత్తం ప్లాస్టిక్ స‌ర్జ‌రీలే… బ‌య‌ట ప‌డ్డ షాకింగ్ నిజం..!

సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈరోజు లేడీస్ సూపర్ స్టార్ గా మారింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఆమెకు తిరుగులేని క్రేజ్ ఉండేది. తాజాగా ఆమె అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ కు జోడిగా నటించిన జవాన్ సినిమాతో నేషనల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు నయనతార పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. గత ఏడాది వయసులో తనకంటే చిన్నోడు అయిన తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న నయనతార ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇటు సినిమాలతో పాటు అటు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది నయన్. నయనతార స్వతహాగా మళ‌యాళీ అమ్మాయి హీరోయిన్ కాకముందు ఆమె మళ‌యాళం టీవీ ఛానల్ లో యాంకర్ గా పని చేసేది. ఎప్పుడైతే తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందో ? అక్కడ ఆమె స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు జనాలు కూడా ఆమెను నెత్తిన పెట్టుకున్నారు.

అయితే నయనతార కెరియర్ ప్రారంభంలో ఇప్పుడు ఉన్నంత అందంగా ఉండేది కాదు.. ఆమెకు ఇంత అందం రావడం వెనక ఆమె చాలా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని.. అయితే ఈ విషయం చాలా రోజులపాటు ఆమె సీక్రెట్ గా ఉంచిందని టాక్. తమిళంలో స్టార్ హీరోలకు జోడిగా అవకాశాలు వస్తున్న టైంలో ఆమె సీక్రెట్ గా రెండు మూడు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందట.

ఆ తర్వాతే న‌య‌న్‌కు ఇంత అందమైన రూపం వచ్చిందట. ఇక అక్కడ నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ సౌత్ ఇండియాలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా నయనతార క్రేజీ ఏమాత్రం తగ్గలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news