Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. అర్జున్ రెడ్డికి అమ్మ...

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడిలాంటి సినిమా ఇది..!!

మీనాక్షి చౌదరి.. ఇప్పుడు ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే ఎవరా అంటూ గుర్తు పట్టడానికి అరగంట సేపు టైం తీసుకునే వాళ్ళు . కానీ ఎప్పుడైతే గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్గా సెలెక్ట్ అయిందో అప్పటినుంచి ఆమె టైం మారిపోయింది. బడా బడా హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది .

రీసెంట్గా మీనాక్షి చౌదరి జాక్పాట్ ఆఫర్ కొట్టేసింది అన్న వార్త సినీ వర్గాలలో వైరల్ గా మారింది . మీనాక్షి చౌదరి విజయ్ దేవరకొండ సరసన నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది .

అయితే సెకండ్ హీరోయిన్గా ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని చూస్ చేసుకున్నారట మేకర్స్. కథ ప్రకారం ఆమె ఈ రోల్ లో చాలా బోల్డ్ గా కనిపించబోతుంది అంటూ తెలుస్తుంది. అంతేకాదు విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ కూడా చేయబోతుందట . దీంతో ఈ సినిమా అర్జున్ రెడ్డి ని మించిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news