Newsఅక్ష‌రాలా రు. 287 కోట్ల న‌ట‌సింహం మాస్ జాత‌ర సామి...!

అక్ష‌రాలా రు. 287 కోట్ల న‌ట‌సింహం మాస్ జాత‌ర సామి…!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా భగవంత్‌ కేసరి. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటించిన అఖండ – వీరసింహారెడ్డి రెండు సినిమాలు ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో భగవంత్ కేస‌రితో బాలయ్య హ్యాట్రిక్ హిట్లు కొడతాడు అన్న అంచనాలు ఉన్నాయి. రెండు సూపర్ హిట్ల తర్వాత నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ రు. 68 కోట్లు కావటం విశేషం.

బాల‌య్య‌కు అఖండ‌కు ముందు అన్నీ వ‌రుస ప్లాపులే ప‌డ్డాయి. జైసింహా త‌ర్వాత చేసిన ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు – మ‌హానాయ‌కుడు సినిమాల‌తో పాటు రూల‌ర్ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత రెండు అఖండ‌, వీర‌సింహారెడ్డి సూప‌ర్ డూప‌ర్ హిట్లు. వరుస ప్లాపుల తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య నటించిన చివరి ఐదు సినిమాల టోటల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్క చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.

బాలయ్య చివర ఐదు సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ 287 కోట్ల మార్క్ దాటేయటం విశేషం. గ‌తంలో ప్లాపులు ఉన్నా అఖండ త‌ర్వాత బాల‌య్య మార్కెట్ ఏ రేంజ్‌లో వీరంగం ఆడుతుందో ఈ కింది లెక్క‌లే చెపుతున్నాయి. బాల‌య్య చివ‌ర‌గా న‌టించిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి.

భ‌గ‌వంత్ కేస‌రి – 67.35 కోట్లు
వీర‌సింహారెడ్డి – 73 కోట్లు
అఖండ – 53 కోట్లు
రూల‌ర్ – 23.75 కోట్లు
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు – 70.60 కోట్లు
జైసింహా – 26 కోట్లు
పైసావ‌సూల్ – 32.5 కోట్లు
శాత‌క‌ర్ణి – 46 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news