Moviesక్లిం కార విషయంలో మెగా ఫ్యాన్స్ మరీ టూ మచ్ చేస్తున్నారా..?...

క్లిం కార విషయంలో మెగా ఫ్యాన్స్ మరీ టూ మచ్ చేస్తున్నారా..? ఫోటో రివీల్ అయితే ఇంత హంగామానా..?

వామ్మో .. ఏంటిది మెగా మనవరాలు క్లిం కార ఫోటో రివిల్ చేస్తే ఇంత హంగామానా..? జనాలకు వేరే పని పాట లేదా..? ఇలాంటి కామెంట్స్ తోనే కొందరు ఆకతాయిలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఏకీపారేస్తున్నారు . నిజానికి సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మెగా మనవరాలు క్లిం కార కి సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మెగా అభిమానులు . మరీ ముఖ్యంగా ఆమె ఫోటో రిలీజ్ చేయడం కోసం చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

కొందరైతే ఏఐ క్రియేషన్స్ ద్వారా క్లిం కార ఫోటో ఇలా ఉంటుంది అంటూ రివీల్ చేశారు . అయితే రీసెంట్ గా వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్ళిన మెగా- కామినేని ఫ్యామిలీ అక్కడ బ్యూటిఫుల్ పిక్స్ దిగారు . ఆ పిక్స్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు . ఇక్కడే పెద్ద తలనొప్పి వచ్చి పడింది . ఆ పిక్చర్స్ లో మెగా మనవరాలు ఫేస్ రివీల్ అయిపోయింది .

ఉపాసన – రాంచరణ్ ఫేస్ కనపడకుండ చాలా జాగ్రత్తగా పడిన ఆమె ఫేస్ ఆమె ఆపోజిట్ ఉన్న నీళ్లల్లో క్లియర్గా కనిపిస్తుంది . దీన్నే జూమ్ చేసి కొందరు అభిమానులు ఇదే రాంచరణ్ ముద్దుల కూతురు క్లింకార ఫోటో అంటూ వైరల్ చేస్తున్నారు . దీంతో కొందరు జనాలు మండిపడుతున్నారు . అసలు మీకు వేరే పని పాట లేదా..? ఎంతసేపు ఆ మెగా ఫ్యామిలీ గురించేనా ..? అవును ఆయనకు కూతురు పుట్టింది.. కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాడు. అందరు చేసేదేగా.. మరి ఎందుకు క్లింకారపై ఇంత ఓవర్ చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు . మరికొందరు ఇది మెగా భజన బ్యాచ్ అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news