Moviesహీరోయిన్‌గా సక్సెస్ కాకపోయినా ఆ య‌వ్వారాల‌తో లక్షలు సంపాదిస్తున్న టాలీవుడ్ హీరోయిన్‌..!

హీరోయిన్‌గా సక్సెస్ కాకపోయినా ఆ య‌వ్వారాల‌తో లక్షలు సంపాదిస్తున్న టాలీవుడ్ హీరోయిన్‌..!

భానుప్రియ లాంటి అద్భుతమైన నటిని పరిచయం చేసిన పెద్ద వంశీ తన సినిమాలలో హీరోయిన్ కి మంచి పాత్ర రాసుకుంటుంటారు. ఈ విషయం ఆయన రూపొందించిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఈ జనరేషన్ దర్శకులతో పోటీ పడకుండా తన స్టైల్లోనే కళ్యాణి, రవితేజలతో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాను తీసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత గోపీ గోపిక గోదావరి చిత్రాన్ని తీసి ఓ మాదిరి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి వంశీ రూపొందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం ఆయన సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. ఆయన పుస్తక లోకంలో మునిగి తేలుస్తున్నారు. అయితే, చిత్ర పరిశ్రమకి వంశీ పరిచయం చేసిన హీరోయిన్స్ లో హన్సానందిని ఒకరు. మరాఠి కుటుంబ నేపథ్యం ఆమెది.

హంస నందిని అసలు పేరు పూనమ్. ఆమె మొదటి సినిమా అనుమానాస్పదం. ఈ సినిమా సెలక్షన్స్ సమయంలో దర్శకుడు వంశీ పూనమ్ పేరును మార్చి హంస నందినిగా మార్చారు. అయితే, హీరోయిన్ గా ఈ బ్యూటీ మొదటి సినిమా డిజాస్టర్ గా నిలిచింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి మొదటి సినిమా ఫ్లాపైతే మన వాళ్ళు పక్కన పడేస్తారనే విషయం తెలిసిందే. అదే హంస విషయంలోనూ జరిగింది.

ఆ తర్వాత హంస చిన్న చిన్న క్యారెక్టర్స్ కి ఐటెం సాంగ్స్ కి పరిమితం అయింది. ఇటీవల ఈ అవకాశాలు కూడా దక్కడం లేదు. కానీ, మోడల్ కో ఆర్డినేటర్స్ ద్వారా కమర్షియల్ ఈవెంట్స్ లో సెక్సీ డాన్సులు చేస్తూ ఆ వ్యవహారాలలో బాగా దూసుకెళుతూ లక్షలు సంపాదిస్తుందట. బడా వ్యాపార వేత్తలతోనూ హంస బాగా కనెక్ట్ అయి ఉందని చెప్పుకుంటున్నారు. ఒక్క సినిమా చేసి జనాలు గుర్తు పడితే చాలు డబ్బు సంపాదనకి ఎన్నో మార్గాలు. అది హంస లాంటి వారిని చూస్తే తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news