Moviesవరుణ్ తేజ్ అత్త-మామలు ఏం చేస్తారో తెలుసా..మెగా ఫ్యామిలీకి మించిపోయే బ్యాక్...

వరుణ్ తేజ్ అత్త-మామలు ఏం చేస్తారో తెలుసా..మెగా ఫ్యామిలీకి మించిపోయే బ్యాక్ గ్రౌండ్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి . త్వరలోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్.. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు . దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి.

మెగా ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాళ్ల గురించి ఏదో ఒక వార్త ట్రెండింగ్ లో ఉండనే ఉంటుంది . అయితే దానికి పూర్తి ఆపోజిట్ లావణ్య త్రిపాఠి కుటుంబం . బయట ప్రపంచానికి తమ కుటుంబం గురించి ఏమీ తెలియకూడదు . మేము సామాన్య జనాల మాదిరిగానే ఉండాలి అనుకునే టైప్ .. కానీ అలాంటి కుటుంబం ఇప్పుడు బడా స్టార్ సెలబ్రిటీ కుటుంబంతో వియ్యం అందుకోబోతుంది. కాగా లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టు న్యాయమూర్తి తల్లి గవర్నమెంట్ టీచర్ .

లావణ్య కు ఓ చెల్లి ఓ తమ్ముడు కూడా ఉన్నారు. చదువుపై ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని లావణ్య త్రిపాఠి డిగ్రీ వరకు ముక్కి మూలిగి చదివి .. ఆ తర్వాత మోడలింగ్ వైపు వచ్చి మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత అందాల రాక్షసి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . వరుణ్ తో ప్రేమాయణం చెప్పగానే ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు . ఆ తర్వాత కుటుంబం మంచిది అని పిల్లాడు మరింత మంచివాడు అని తెలుసుకొని లావణ్య త్రిపాఠి కుటుంబం ఈ పెళ్లికి యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది . మొత్తానికి లావణ్య వరుణ్ అత్తమామల బ్యాగ్రౌండ్ చాలా కూల్ అండ్ డీసెంట్ ది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news