Newsఎన్టీఆర్ ' దేవ‌ర ' సీక్వెల్ స్టోరీ లైన్ ఇదే.. అక్క‌డ...

ఎన్టీఆర్ ‘ దేవ‌ర ‘ సీక్వెల్ స్టోరీ లైన్ ఇదే.. అక్క‌డ నుంచే ‘ దేవ‌ర 2 ‘ మొద‌లు..!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న దేవర సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే దర్శకుడు కొరటాల ఇటీవల అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చారు. దేవరను రెండు పార్టీలుగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

దేవర 2 ఎక్కడి ? నుంచి స్టార్ట్ అవుతుందని దానిపై ఇప్పుడు ఈ సినిమా యూనిట్ వర్గాల నుంచి లీక్ అయిన‌ మేటర్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతుంది. చనిపోయాడు అనుకున్నదేవర‌ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండో ఎన్టీఆర్ పాత్ర క్లైమాక్స్ సీక్వెన్స్ లో బిగ్ ట్విస్ట్ ఇస్తాడని.. అప్పుడు అతడి ఎంట్రీ ఉంటుందని అలా ఈ క్లైమాక్స్ లోనే దేవర కథకు సంబంధించి మిస్టరీ పాయింట్ కూడా రివీల్ అవుతుందని.. ఈ పాయింట్ దగ్గరే సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది.

ఏది ఏమైనా దేవరలో ఓల్డ్ ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్‌ కూడా డిఫరెంట్ మేకవర్ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కొరటాల మామూలుగా కసరత్తులు చేయలేదు.. అందుకే ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించడంతో తారక్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తితో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news