News' భ‌గ‌వంత్ కేస‌రి ' వ‌ర‌ల్డ్ వైడ్ 10 డేస్ వ‌సూళ్లు.....

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ వ‌ర‌ల్డ్ వైడ్ 10 డేస్ వ‌సూళ్లు.. బాల‌య్య వ‌సూళ్ల గోల‌య్యా..!

నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్‌ కేసరి. దసరా కానుకగా ఈ నెల 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలిరోజు మంచి టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు ఈ సినిమాకి పోటీగా తమిళ్ స్టార్ హీరో విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా దసరాకి రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూడు సినిమాలు పోటీలో భగవంత్ కేసరి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసి దసరాకు క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా పది రోజులు పూర్తిచేసుకుంది. పది రోజుల్లో భగవంత్ కేసరి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.124 కోట్ల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. షేర్ రూ.65 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉంది. అఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత బాలయ్యకు ఇది వరుసగా మూడో విజయం.

దాదాపూ మూడు దశాబ్దాల తర్వాత బాలయ్యకు వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలు పడ్డాయి. వరల్డ్ వైడ్‌గా భగవంత్ కేసరి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల ఈ సినిమా నిర్మాతలు, టీమ్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రాలో భగవంత్‌ కేసరి టీం సక్సెస్‌ఫుల్ టూర్ కూడా నిర్వహిస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ రాంపాల్ విల‌న్‌గా నటించారు.

మ్యూజికల్ సెన్సేష‌న్ థ‌మ‌న్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఏది ఏమైనా మూడు వ‌రుస రూ.100 కోట్ల సినిమాలలో నటించిన బాలయ్య సెన్సేషనల్ విక్టరీ తన ఖాతాలో వేసుకున్నారని చెప్పాలి. ఇక బాలయ్య 109వ సినిమా బాబీ దర్శకత్వంలో పట్టాలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news